ఆమ్రపాలి పెళ్లి గిఫ్ట్ గా KCR ఏం ఇచ్చారో తెలుసా?

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వివాహం ఆదివారం జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. 2011 బ్యాచ్ కి చెందిన IPS అధికారి సమీర్ శర్మతో వివాహం జరిగింది. ఈ నెల 23 న వరంగల్ లో , 25 న హైదరాబాద్ లో రిసెప్షెన్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆమ్రపాలి చురుకైన పనితీరుతో అందర్నీ ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీయార్ తో కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆమ్రపాలి,సమీర్ శర్మలు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
ఈ నెల 23 వ తారీఖున వరంగల్ వస్తున్నారు ఆమ్రపాలి. వరంగల్,హైద్రాబాద్ లావు విందు అయ్యిపోయాక మార్చి 7 వ తేదీ వరకు హనీమూన్ కోసం టర్కీలో గడపబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆమ్రపాలి తండ్రి వైజాగ్ కి చెందిన వెంకట రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. చిన్నతనం నుండి చదువులో చురుకుగా ఉండే ఆమ్రపాలి IIT మద్రాస్ నుంచి సివిల్ ఇంజనీర్ లో BTech చేసారు.
బెంగుళూర్ IIM నుండి PG డిప్లొమో పట్టాను అందుకున్నారు. 2010 లో సివిల్స్ రాసి 39 వ రాంక్ సాధించి సొంత రాష్ట్ర కేటర్ లో IAS గా ఎంపిక అయ్యారు.
2014 లో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమ విభాగంలో పనిచేసారు. ఆ తర్వాత 2016 లో కేసీయార్ ప్రభుత్వం వరంగల్ అర్బన్ కలెక్టర్ గా నియమించింది.
ఆమ్రపాలికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే పనిలోనూ, జీవితంలోను ప్రత్యేకతను కనబరుస్తారు. మోడ్రన్ దుస్తుల్లోనూ,సాంప్రదాయ చీర కట్టులోనూ కన్పిస్తారు. ఆమె గతంలో ట్రెక్కింగ్ చేసి యువతకు ఆదర్శం అయ్యారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమ్రపాలి పెళ్ళికి కేసీయార్ ఏమి గిఫ్ట్ ఇచ్చారనే వార్త బాగా వైరల్ అవుతుంది. కేసీయార్ ఆమ్రపాలి పెళ్లి గిఫ్ట్ గా గోల్డెన్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేసీయార్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆమె చాలా ఆనందం వ్యక్తం చేశారట.

Related Post