“హియర్.. మోడీ కాలింగ్…, PK ..PK.. హలో…”, మరి జగన్ కు దిక్కెవరు ఇక…

లూథియానా నగర పాలిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగరేసింది, BJP ను ఊడ్చి పారేసింది. నగదు రద్దు, GST, బ్యాంకు ల దివాలా విధానాలు, వగైరాలు మోడీపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. ఆర్ధిక విధానాలలో పీవీ, వాజపేయ్ లకు తగ్గ వారసుడు కాలేకపోయారు మోడీ. మోడీ విదేశాంగ విధానం బానే ఉన్నా, అది ఒక్కటి మాత్రమే సరిపోదు, గెలుపు బాటకు. అసలు మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గెలవడానికి తలప్రాణం తోకకు వచ్చింది BJP కు. అమిత్ షా ఎత్తుగడలలో ఎక్కడో తేడా కొట్టింది.

ఇక ఇలా కాదు అని అనుకున్న మోడీ కు, 2012 ఎన్నికలలో గుజరాత్ కు మూడోసారి ముఖ్యమంత్రి అవడం లో కీలక వ్యూహరచన చేసిన వ్యక్తి, అలానే, 2014 ఎన్నికలలో కేంద్రం లో BJP ను అందలం ఎక్కించి మోడీని ప్రధాని కావడానికి కారణమైన PK .. అదేనండీ.. ప్రశాంత్ కిషోర్ గుర్తువచ్చాడు.

2014 లోక్ సభ ఎన్నికల తరువాత అమిత్ షా తో విబేధాల కారణం గా బీజేపీ కు దూరమయ్యాడు PK. 2019 ఎన్నికలలో గెలుపు పై సందేహమేర్పడిన మోడీ, PK కు కబురంపాడు. 2019 కోసం వ్యూహకర్త గా ఉండాలని మోడీ కోరితే PK మరి కాదనలేకపోయాడు.

సరే, ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. PK చరిత్ర చూసి తాను ముఖ్యమంత్రి కావాలంటే PK నే దిక్కు అనుకున్న జగన్, 2019 కోసం తన పార్టీ కు PK ను వ్యూహకర్త గా నియమించుకున్నాడు. కానీ ఇపుడు మోడీ ఇలా.., పోనీ PK .. మోడీ ను జగన్ ను జత కట్టేలా చేస్తాడా .. అంటే, ఆంధ్రా కు ప్రత్యేక హోదా పై హామీ లభించనిదే, జతకట్టలేని పరిస్థితి జగన్ ది. విధి ఆడే వింత నాటకం లో ముఖ్య మంత్రి కుర్చీ పై జగన్ కూర్చుంటాడో లేదో వేచి చూడాల్సిందే… 2019 వరకు.

Related Post