టెన్త్ హాల్ టికెట్ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలా.?

పదో తరగతి పరీక్షలు. పిల్లలకే కాదు.. పేరంట్స్ కూడా టెన్షన్. ఇంటిల్లాపాదీ హైరానా. పదో తరగతి ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. హాల్ టికెట్ ఇప్పటికే స్కూల్స్ కి పంపించేశారు. పిల్లలకు కూడా చాలా మంది తెచ్చుకున్నారు. ఎవరికైనా హాల్ టికెట్ అందకపోయినా.. మిస్ అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ విద్యాశాఖ. ఎవరైనా హాల్ టికెట్ పోగొట్టుకున్నా.. సకాలంలో అందకపోయినా వెబ్ సైట్ www.bse.telangana.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ హాల్ టికెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది విద్యాశాఖ.

10వ తరగతి హాల్ టికెట్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి :

bse.telangana.gov.in వెబ్ సైట్ కు లాగిన్ కావాలి
పేజీలోకి వెళ్లిన తర్వాత ఎడమ చేతి వైపు ఉన్న ఆప్షన్స్ లో TS SSC hall ticket పై క్లిక్ చయాలి

నాలుగు లింక్ ఆప్షన్స్ వస్తాయి. రెగ్యులర్, ప్రైవేట్, ఓఎస్ఎస్ సీ, ఒకేషనల్ హాల్ టికెట్స్ అని ఉంటాయి.

మీరు ఏ కేటగిరిలో ఉన్నారో చూసుకుని క్లిక్ చేయాలి.

హాల్ టికెట్ డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది. అందులో మీ జిల్లా, మీ స్కూల్ నేమ్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే చాలు మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.

ప్రింట్ ఔట్ తీసుకోవాలి

Related Post