‘రంగస్థలం’ లో కథను మలుపు తిప్పే పాత్రలు ఎన్నో తెలుసా?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంతల కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ సినిమా కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. చిరు ఈ సినిమా రషెష్ చూసి కొన్ని మార్పులను సూచించారు. ఎప్పుడు చిరు మాట వినే చరణ్ సుకుమార్ మీద నమ్మకంతో ఆ మార్పులకు ఇష్టపడలేదు. అంతలా చెర్రీని ‘రంగస్థలం’ కథ, సుకుమార్ స్టైల్ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో కథ అంతా ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. హీరో చిట్టిబాబు,హీరోయిన్ రామలక్ష్మి పాత్రలు ఎలాగూ ముఖ్యమైన పాత్రలే. వీరితో పాటు కథను మలుపు తిప్పే పాత్రలలో జగపతిబాబు,అనసూయ నటించారు.

ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ విలన్. జగపతిబాబు చాలా సినిమాల్లో విలన్ గా చేసిన ఈ సినిమాలో జగపతిబాబు నటన చాలా సూపర్ గా ఉందనే టాక్ వినపడుతుంది.

చిట్టిబాబు అన్న కుమార్ బాబుగా ఆది పినిశెట్టి నటించాడు. ఈ పాత్ర కూడా కథకు చాలా కిలకమైనది. ఇప్పటికే స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న ఆది ఈ సినిమాలో కూడా నెగిటివ్ క్యారెక్టర్ వేస్తున్నాడు. ఈ సినిమాలో ఆదికి మంచి పేరు వస్తుందని సమాచారం.

ఇక ఇంతవరకు వెండితెరపై పెద్దగా ప్రాధాన్యమున్న పాత్ర వేయని అనసూయకు రంగస్థలం మెమరబుల్ అవుతుందని అంటున్నారు ఆ సినిమా యూనిట్.

Related Post