అమరావతిలో పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టడానికి మరో కారణం

ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లాలో తన నూతన గృహ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త ఇంటిని నిర్మించటానికి గల కారణాలను మీడియాకు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో కీలక సమయం… ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో ఇంటి నిర్మాణాన్ని తలపెట్టానని అన్నారు.

అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పులు జరిగితే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండవలసిన అవసరం ఉందని చెప్పారు.

తాను ప్రజల్లోకి వెళ్లాలన్నా …ప్రజలు తన దగ్గరకు రావాలన్నా ఇక్కడ ఉంటేనే సులభం అవుతుందని…ఈ నెల 14 తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని….తన అభిప్రాయాలను వ్యక్తం చేయటానికే ప్రయత్నిస్తానని చెప్పారు.

సమస్యలు ఎదురైతే పారిపోయే మనస్తత్వం తనది కాదని చెప్పారు. జనసేన పార్టి ఆవిర్భావం రోజున తన మనస్సులోని మాటలను చెపుతానని చెప్పారు.

Related Post