BREAKING NEWS: జూనియర్ ఎన్టీఆర్ కు ఆక్సిడెంట్…!

“బాహుబలి” సినిమా తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ను, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీయార్ ను కలిపి ఒక మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫోటోషూట్ కోసం ఎన్టీయార్ ఇటీవల చరణ్ తో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

సినిమా లుక్ కోసం టెస్ట్ షూట్ చేయాలనుకొన్నాడు రాజమౌళి. అయితే.. ఆ షూట్ కి ముందు ఎన్టీయార్ తన హోటల్ రూమ్ లో కాలు జారి పడటంతో చిన్న చిన్న గాయాలు అయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా మొదలు అయ్యే సమయంలో రాజమౌళి సినిమా లుక్ కోసం టెస్ట్ ఏంటీ అని అందరూ అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం స్లిమ్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ స్లిమ్ లుక్ లో ఫోటో షూట్ చేయాలనీ రాజమౌళి భావించాడట.
Rajamouli,NTR,Ram charan
త్రివిక్రమ్ సినిమా పూర్తీ అయ్యాక మరో ఫోటో షూట్ చేయాలని భావించాడు. ఎన్టీఆర్ కి గాయాలు కావటంతో రామ్ చరణ్ కి సపరేట్ ఫోటోషూట్ చేస్తున్నాడట.ఎన్టీఆర్ కి గాయాలు తగ్గాక ఫోటో షూట్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు. ఎన్టీఆర్ గాని, రాజమౌళి గాని చెప్పితేనే అసలు నిజం తెలుస్తుంది.

Related Post