శ్రీదేవి చెల్లెలికి ఇంత పాషాణ హృదయమా..?

దివంగత నటి శ్రీదేవి మనల్ని విడిచి 25 రోజులు పైనే అయింది..ఆమె కుటుంబం ఇప్పుడిప్పుడే తన జ్ణాపకాలతో బతికేందుకు సిద్దమవుతుంది. దుబాయ్ లో శ్రీదేవి మరణించడం,నాలుగు రోజుల హైడ్రామా తర్వాత మృతదేహం ముంబైకు రావడం,అంత్యక్రియలు పూర్తవడం జరిగింది. శ్రీదేవి మృతదేహాన్ని చూడడానికి ఎంతో మంది అభిమానులు ,సినీ ప్రముఖులు వచ్చారు.

కానీ శ్రీదేవి తోడబుట్టిన చెల్లెలు శ్రీలత మాత్రం అక్క అంత్యక్రియలకు రాలేదు. కనీసం అక్క మృతి గురించి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు . అసలు ఆమె రాకపోవటానికి కారణాలను చూస్తే….

శ్రీదేవి అంత్యక్రియలకు శ్రీలత హాజరు కాలేదు.కనీసం శ్రీదేవి మృతికి సంతాపం తెలియజేస్తూ ఒక్క మాట కూడా ఆమె మాట్లాడినట్లు బయటకు రాలేదు. ఆమె ఇంత పాషాణ హృదయురాల అని బోని ఫ్యామిలిలో కొందరు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు శ్రీలత ఆమె భర్త సతీష్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు.

చెన్నైలో శ్రీదేవికి బంగ్లా ఉంది. .అంతకు ముందు వరకు ఆ బంగ్లాలో శ్రీలతకు కొంత మాత్రమే వాటా ఉండేదట. తర్వాత ఆ బంగ్లాని శ్రీదేవి తన చెల్లెలు సొంతం చేసేసింది.శ్రీదేవి ఆ బంగ్లాని పూర్తిగా తన సోదరికి ఎందుకు అప్పగించిందో ఎవరికీ తెలియదని శ్రీదేవి కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు వీరిమధ్య భేదాలు ఎక్కడొచ్చాయో తెలుసా.

శ్రీలత, శ్రీదేవి మధ్య గతంలో వారి తల్లి ఆసుపత్రి ఖర్చు విషయంలో వివాదం నెలకొందని వార్తలు వచ్చాయి. విషయాన్ని తిరుపతిలో ఉంటున్న శ్రీదేవి బంధువులు ధృవీకరించారు. కానీ ఆ తరువాత ఆ వివాదాలు సమసిపోయాయని వారే చెప్పారు. గతంలో శ్రీదేవి తల్లి రాజేశ్వరికి బ్రెయిన్ కి సంభందించి అమెరికాలో వైధ్యం చేయించారు.అక్కడ వైధ్యుల తప్పిదం వలన తలకు ఒకవైపు చేయాల్సిన ఆపరేషన్ మరోవైపు చేయడంతో ఆమె మరణించింది.

అప్పుడు ఆ ఆసుపత్రి వారు పెద్ద మొత్తంలోె నష్టపరిహారం ఇచ్చారు.ఈ నష్టపరిహారం రావడంలో శ్రీదేవికి బోణియే సహకరించారు.తల్లి మరణం తర్వాత బోణికి మరింత దగ్గరయ్యరు శ్రీదేవి అది వేరే విషయం.ఆ నష్టపరిహారం విషయంలో కూడా శ్రీదేవితో శ్రీలత గొడవపడింది. అప్పుడు కూడా డబ్బంతా తీస్కోవడం..గొడవలకు ఆజ్యం పోయడం కూడా అక్కడే ప్రారంభమైంది.

ఆఖరుకి ఆస్తి తగాదాలు ఉన్నాయి అని వార్తలోచ్చినప్పటికి కపూర్ ఫ్యామిలి,బోణి మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్,అన్షులా కూడా శ్రీదేవి అంత్యక్రియలు దగ్గరుండి చేశారు..శ్రీదేవి అంత్య క్రియలకు శ్రీలత ఎందుకు హాజరు కాలేదు. ఈ ప్రశ్నకు సమాధానం అభిమానులకే కాదు చివరకు బందువులకు కూడా దొరకడం లేదు.

Related Post