కత్తికి పడింది కౌంటర్….ఎలాగో చూడండి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. చరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్‌లో ఈ సినిమా తొలి వారాంతానికే ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమా తొలి వీకెండ్‌లో 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఆ రెండు తెలుగురాష్ట్రాల , కలుపుకొని ప్రపంచవ్యాపంగా ఈ సినిమా మూడు రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టిన రంగస్థలం టీమ్ మొత్తం థాంక్స్ మీట్ ఆరెంజ్ చేసింది.

దీనికి ప్రత్యేక అతిధిగా రాంచరణ్ మరియు సుకుమార్ రావడం జరిగింది. ఆ సభలో సినిమా సక్సెస్ గురించి ఎనో విషయాలను మాట్లాడాడుతూ సుకుమార్ రంగస్థలం కి ప్రజలు , మేధావులు , క్రిటిక్స్ అందరు ఒప్పుకున్నారని అందుకే ఇంత పెద్ద విజయం సాధించిందని చెప్తూనే ఇండైరెక్ట్ గా కత్తి మహేష్ రాసినా రివ్యూ కి పంచ్ ఇచ్చాడు.

ఈ సినిమాతో 100 శాతం అందర్నీ సంతృప్తి పరచాడు , ఒకటి రెండు శాతము మనం ఎంత బాగా తీసిన పబ్లిసిటీ కోసం విమర్శించేందుకు రెడీగా ఉంటారు .., అసలు రంగస్థలం 1980 బ్యాక్ గ్రౌండ్ కాలానికి పోవడానికి లాజిక్ లేదు లింక్ లేదు , ఇది పాత చింతకాయ పచ్చడి సినిమా అని కొందరు అంటున్నారు.

1980 కి పోవడానికి లాజిక్ ఉంది , అదే ప్రేక్షకులకి కొత్త సినిమాను అందించడం, కేవలం తమిళం,మలయాళం సినిమాల్లోనే నేటివిటీ సినిమాలు ఉంటాయి , మన తెలుగువాళ్లు అలాంటి సినిమాలు తీయలేరు , మన హీరోలకి అంత కహ్టపడి నటించే సత్త లేదు అనుకుంటున్నా వారికందరికి , మన తెలుగు దర్శకులు , హీరోలు , ఆర్ట్ డిపార్ట్మెంట్ వారికి అలాంటి సత్తా ఉందని నిరూపించడానికి ఈ సినిమా తీసాను.

ఇదే ఈ సినిమాకి లాజిక్ అంటూ కత్తి కి ఇండైరెక్ట్ గా పంచ్ ఇచ్చాడు సుకుమార్ .., ఇక చూద్దాం మరి సుకుమార్ ఇచ్చిన ఈ షాకింగ్ ఆన్సర్ కి కత్తి మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో.

error: Content is protected !!