Movies

‘భరత్ అనే నేను’ సినిమా లో మహేష్ బాబు సెక్యూరిటీ ఆఫీసీర్ ఎవరో తెలుసా అతని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

సినిమా రంగంలో ప్రతి ఒక్కరు రకరకాల పాత్రలను చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి ప్రేక్షకులకు గుర్తుండాలని అనుకుంటారు. ఇప్పుడు ముక్తార్ ఖాన్ అనే నటుడు గురించి తెలుసుకుందాం. ఈయన హైదరాబాదీ ముస్లిం. చిన్నతనం నుండి సినిమాల మీద ఆసక్తితో ఉండేవాడు. 1991 లో చిరంజీవి హీరోగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ అయినా రౌడీ అల్లుడు సినిమాలో విలన్ పాత్రను పోషించి తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా హిట్ కావటంతో అతనికి క్యారెక్టర్ రోల్స్ లో నెగిటివ్ రోల్స్ లో మంచి గుర్తింపు రావటంతో మంచి మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నెగిటివ్ రోల్స్ తెలుగు,తమిళ్,కన్నడ,హిందీ,భోజపురి భాషల్లో నటించాడు. ముక్తార్ ఖాన్ దాదాపుగా 100 సినిమాల్లో నటించాడు. దాదాపు రెండు దశాబ్డల పాటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ రోల్స్ తో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ, ఒక టీవీ సీరియల్ లో ద్వారా చాలా పేరు వచ్చింది.

ఆ టివి సీరియల్ మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చిన మొగలిరేకులు. ఈ సీరియల్ లో సికిందర్ బాయ్ గా నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యి అందరి చేత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో ఒక పక్క సినిమాలు మరో పక్క సీరియల్స్ తో చాలా బిజీగా మారిపోయాడు ముక్తార్ ఖాన్.

ఇదిలా ఉంటే బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్ కొట్టిన సింహ సినిమాలో కమీషనర్ పాత్ర వేసాడు. ముక్తార్ ఖాన్ భారీ పర్సనాలిటీ ఉండటంతో ఎక్కువగా పోలీస్ పాత్రలే వచ్చేయి. ముక్తార్ ఖాన్ స్టార్ హీరోలు అయినా చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేష్,రామ్ చరణ్,ప్రభాస్ వంటి హీరోలతో చాలా సినిమాలు చేసాడు.

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలు అయినా సల్మాన్ ఖాన్,షారుక్ ఖాన్ లతో కలిసి నటించాడు. ఇంతవరకు నెగిటివ్ షేడ్స్, విలన్ పాత్రల్లో నటించిన ముక్తార్ ఖాన్ మొదటిసారిగా మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

ఈ సినిమాలో ప్రతి ఫ్రెమ్ లో మహేష్ బాబు పక్కన ఎక్కువగా కన్పించింది ఎవరా అంటే ముక్తార్ ఖాన్ అని చెప్పాలి. ఈ సినిమా ముక్తార్ ఖాన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ముక్తార్ ఖాన్ కి సొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు ఇరానీ హోటల్ లో పనిచేసేవాడు. ఇప్పుడు ఇరానీ గ్రూప్ అఫ్ హోటల్స్ కి అధినేత అవ్వటం విశేషము.