Health

యోగా సాధనలో ఉన్న నియమాల గురించి మీకు తెలుసా?

యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, అలాగే శారీరకంగా,మానసికంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే యోగ చేయటానికి కూడా ఒక విధి,విధానం ఉన్నాయి. యోగాను నియమ నిష్టలతో చేస్తేనే మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ అలక్ష్యం చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. యోగాను పరగడుపున చేస్తే మంచిది. ఆలా చేయలేని వారు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. నేల మీద దుప్పటి లేదా చాప వేసుకొని మాత్రమే యోగ చేయాలి. మహిళలు గర్భిణిలుగా ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు యోగా చేయకూడదు. యోగా చేసే వారు సౌకర్యంగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించి యోగా సాధనను చేయాలి.

బాగా అలసటగా ఉన్నప్పుడు, ఆనారోగ్య సమస్యలు ఉన్న సందర్భంలో, ప్రశాంతమైన వాతావరణంలో బాడీ, మైండ్ విశ్రాంతిగా ఉన్న స్థితిలో యోగా మొదలుపెట్టాలి. ప్రార్ధనతో సాధన ప్రారంభించాలి.

ప్రార్ధన వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. శ్వాస తీసుకోవడం కానీ, వదలడం కానీ నాసిక ద్వారా మాత్రమే చేయాలి. యోగా సాధన ముగిశాక 20 – 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఆహారం కూడా యోగా చేసిన తర్వాత 20 -30 నిమిషాలకు చేయాలి.