కెమెరా లేదని అనుకోని నిజాలు బయటపెట్టిన తేజస్వి

బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయటంతో మంచి క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో రెండో సీజన్ కి నాని హోస్టింగ్ చేస్తున్నాడు. నానితో బిగ్ బాస్ వర్క్ అవుట్ అవ్వదేమో అని అనిపించింది. మొదటి రోజు పార్టిసిపెంట్స్ ని చూసాక ప్రేక్షకులకు చిరాకు వచ్చేసింది. ఎవరో వస్తారని అనుకుంటే రొటీన్ వాళ్లనే తీసుకువచ్చారనే టాక్ వైరల్ అయింది. కానీ రెండో రోజు పార్టిసిపెంట్స్ లో మార్పు వచ్చి ఎత్తులు వేయటం అందరిలోనూ ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా బాబు గోగినేని ఎవరు ఊహించని కోణంలో ఉండటం హైలెట్ అవుతుంది. తేజస్వి,సంజన బాగా వారి పరిధిలో బాగా రాణిస్తున్నారు. ఈ షోతో తేజస్వి బాగా కిక్ అవుతుందని చెప్పవచ్చు.

బిగ్ బాస్ లో అప్పుడప్పుడు కెమెరా ఉన్న సంగతి మర్చిపోయి కొంతమంది వ్యక్తిగత విషయాలను చెప్పేస్తూ ఉంటారు. అలాగే తేజస్వి తన జీవితం గురించి చెప్పుతూ తన ఆదాయ వనరుల గురించి చెప్పేసింది.

మొదట తన సినిమా అవకాశాల గురించి చెప్పుతూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత డబ్బు కోడం ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఫిలిం ఇండస్ట్రీ లో పనిచేసేటప్పుడు రోజుకి 12000 మాత్రమే వచ్చేవి.

మంచి అవకాశాలను వెతుక్కోవటానికి ఉద్యోగాన్ని వదిలేసాను. ఇక బిగ్ బాస్ లో ఉన్నందుకు ఇంత ఇస్తున్నారని చెప్పింది. కానీ ఎడిటింగ్ లో బీప్ సౌండ్ వేశారు. అయితే వీళ్లకు రోజుకి కొంత అందుతున్న మాట నిజమే. బిగ్ బాస్ కి క్రేజ్ ని పెంచటానికి స్టార్ మా సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలను బాగానే చేస్తుంది.

Related Post