Movies

కీర్తి సురేష్ కొంప ముంచిన మహానటి సినిమా… ఘోరమైన స్థితిలో కీర్తి

మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ని ఎంచుకున్నప్పుడు ఆమెపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ కీర్తి సురేష్ అందరిని ఆశ్చర్యపరుస్తూ సావిత్రి పాత్రలో చాలా బాగా ఒదిగిపోయింది. అంతేకాక అందరి దగ్గర నుండి మంచి ప్రశంసలే దక్కాయి. మహానటి సినిమా తర్వాత కీర్తి కెరీర్ మరో స్థాయికి వెళుతుందని అందరు భావించారు. అంతేకాక ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అందరూ భావించారు. అయితే ఆమె ముందుగా కమిట్ అయినా సినిమాలు తప్పితే కొత్తగా అవకాశాలు ఏమి రాకపోవటం అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషయంలో దర్శక నిర్మాతల తప్పు ఏమి లేదని కీర్తి తప్పే అని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ఎలా అంటే మహానటి సినిమా ఆమెకు గొప్ప పేరును తెచ్చిపెట్టింది. అంతేకాక ఆమెపై అంచనాలు కూడా పెరిగిపోవటంతో ఆ అంచనాలను అందుకొనే విధంగా ఉండే పాత్ర కోసం వెయిట్ చేస్తుందట కీర్తి. కీర్తి గ్లామర్ రోల్స్,కమర్షియల్ సినిమాలకు నో చెపుతోందట. అయితే మహానటి లాంటి పాత్రలు ఎప్పుడో కానీ రావు. గ్లామర్ రోల్స్ చేస్తూనే అటువంటి అరుదైన పాత్రలు వచ్చినప్పుడు చేస్తూ ముందుకు సాగాలి.

సమంతా,అనుష్క వంటి వారు గ్లామర్ రోల్స్ చేస్తూనే అరుదైన పాత్రలు వచ్చినప్పుడు చేసుకుంటూ కెరీర్ ని బేలన్స్ చేసుకున్నారు. కీర్తి కూడా వారిని అనుసరించి కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకోకపోతే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి కీర్తి అటువంటి పాత్రలే కావాలని ఇంకా వెయిట్ చేస్తుందా…లేదా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లను ఒకే చేస్తుందా అనేది వేచి చూడాలి.