Movies

నాగబాబుకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కత్తి మహేష్….మెగా బ్రదర్ రియాక్షన్ ఏమిటో?

తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఏదో వివాదంతో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఇప్పుడు మరో వివాదం సంచలనం అయింది. అది అటు తిరిగి ఇటు తిరిగి సినీ రంగాన్ని తాకింది. ఇంతకీ విషయం ఏమిటంటే,తరచూ తన వ్యాఖ్యలతో సంచలనానికి హేతువైన సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఉన్నట్టుండి శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలకు దిగాడు. రాముడు ఓ దగుల్బాజీ అని, సీత రాముని వద్దే ఉంటే, సుఖ పడేదని కత్తి మహేష్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి. ఇక జనశక్తి అనే సంస్థ ఇతనిపై కేసు పెట్టడంతో పోలీసులు కత్తి మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు కూడా. ఇక కత్తి వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు.

ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు తీవ్రంగా స్పందిస్తూ, ఓ వీడియో ద్వారా కత్తి మహేష్ ని ఏకి పారేసారు. ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించవద్దని, అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే భయపడేలా చర్యలు ఉండాలని నాగబాబు ఆ వీడియో ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు, కత్తి పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైతే,ప్రజలే ఆ పని చేసి చూపిస్తారని గట్టిగా వార్నింగ్ కూడా నాగబాబు ఇచ్చారు.

ఇక కత్తి మహేష్ కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లు మరో వీడియో ద్వారా సీరియస్ గా రియాక్ట్ అవుతూ,నాగబాబుకు సీరియస్ వర్కింగ్ ఇచ్చాడు. మాటలు కరెక్ట్ గా ఉంటే, ఎవరూ మీ జోలికి రారని, అలాగే ఎవరూ నా జోలికి రావాల్సిన అవసరం లేదని కత్తి స్పష్టం చేసాడు. ఇక నాగబాబు అభిమానులను రెచ్చగొట్టేలా ఈ వీడియోకి ‘నా ప్రియమైన పెద్దగా గుర్తింపు లేని నాగబాబు గారికి’అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ రిలీజ్ చేసాడు కత్తి. మీరు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ, నాకు సీరియస్ వార్నింగ్ ఇస్తారా’ ఉంటూ కత్తి ఫైర్ అయ్యాడు.

అసలు నన్ను నీచుడు అనడానికి మీరెవరు?ఇదే పంథా కొనసాగించాలనుకుంటే, నేను నా పంథాలో వెళ్తా”అని మరోసారి హెచ్చరించాడు కత్తి. అంతేకాదు ‘ఈ రాజకీయ జీవితం,సినీ జీవితం ఎంత దౌర్భాగ్య మైనదో, ఎంత దగుల్బాజీ తనమో అందరికీ చాటిచెప్పే రోజంటూ ఒకటి వస్తుంది’అంటూ కత్తి సీరియస్ అయ్యాడు. మీ పతనాన్ని మీరే లిఖించుకుంటున్నారు. మీ సామజిక దిగజారుడు తనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారు. ఇక మీద మీ హద్దులో మీరుంటే మంచిదని నేను అనుకుంటున్నా’అంటూ ముగించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.