జులై 27 చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?
జులై 27వ తేదీ ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి శుక్రవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం గా ఏర్పడబోతున్న ఈ గ్రహణం ఏ ఏ రాసుల వారికి ఏవిధంగా ఉండబోతోందో ఒకసారి పరిశీలిద్దాం. ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలపై ఈ గ్రహణ ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రెండు రాసులవారు శాంతులు తప్పకుండా చేయించుకోవాలి. ఇక కొన్ని రాశులవారికి ఈ చంద్రగ్రహణం ఎంతో లాభం చేకూర్చబోతోందంట.
మేష రాశివారికి పదోన్నతి కలుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారో వాళ్లకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇక వృషభ రాశివారిని పరిశీలిస్తే,వీళ్లకు ఏనాటినుంచో గల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
మిధున రాశివారు అకారణంగా వచ్చే నిందల నుంచి బయట పడతారు.
కర్కాటక రాశివారికి ఉండే మనస్పర్థలు తొలగిపోతాయి.
సింహ రాశివారు అప్పుల బాధలు, ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడే అవకాశం ఉంది.
కన్యా రాశివారు సంతానం లేని ఎవరైనా ఉంటే, వారికి సంతానోత్పత్తి జరుగుతుంది.
తులారాశి వారికి గృహ లాభం చేకూరుతుంది.
వృచ్చిక రాశివారికి కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి.
ధనుస్సు రాశివారు సంతోష సౌఖ్యాలు అనుభవిస్తారు.
మకర రాశివారు అనారోగ్యం నుంచి బయట పడతారు.
కుంభ రాశివారు ఇక గతంలో పోగుట్టుకున్న ఆస్తులను తిరిగి పొందుతారు.
మీనరాశి వారిలో ఎవరికైనా అన్నదమ్ములతో గానీ, అక్క చెల్లెళ్ళతో గానీ వైరాలుంటే సమసిపోతాయి.