కౌశల్ ఇచ్చిన భారీ అఫర్ గురించి బయటపెట్టిన నందిని… ఏమిటో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

బిగ్ బాస్ రెండో సీజన్ లో ఈ వారం నందిని రాయ్ ఎలిమినేట్ అయింది. నిజానికి ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా గణేష్ కి ఓటింగ్ బాగా రావటంతో గణేష్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన నందిని ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన నందిని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. తాను అప్పుడే ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని ఇంకా కొన్ని రోజులు హౌస్ లో ఉంటానని భావించానని చెప్పింది. అంతేకాక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కౌశల్ ఆర్మీ ప్రభంజనం చూసి చాలా ఆశ్చర్యం వేసిందని చెప్పింది. గత రెండు వారాలుగా తన ప్రదర్శన బాగుందని… కొన్ని తప్పుల కారణంగా ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.

తనీష్ విషయం అయినా,కౌశల్ విషయం అయినా దీప్తి విషయం అయినా ఒకే వైఖరికి కట్టుబడి ఉన్నానని, కానీ ఆడియన్స్ ఆలోచన మరోలా ఉందని పేర్కొంది నందిని. బిగ్ బాస్ రెండో సీజన్ రెండో వారంలో ఎంటర్ అయినా తనను కౌశల్ ఒక్కడే బాగా రిసీవ్ చేసుకున్నాడని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ మంచి స్నేహితుడు అని,చాలా మంచి సలహాలు ఇచ్చాడని చెప్పింది.

కౌశల్ నాకు ఒక పెద్ద అఫర్ ఇచ్చాడని,అది భారీ ప్రాజెక్ట్ అని, దాని కోసం కౌశల్ కి థాంక్స్ చెప్పుతున్నానని చెప్పింది. అయితే హౌస్ లో జరిగిన కొన్ని విషయాలను మాత్రమే బయటకు చూపిస్తున్నారని, కౌశల్,నేను వాదన పెట్టుకున్నప్పుడు ఇద్దరం అలక చూపుతామని,ఆ తర్వాత ఒకరినొకరు బ్రతిమాలుకొని కలిసి భోజనము చేసేవారమని, అటువంటివి ఏమి బయటకు చూపించలేదని, అలాగే ప్లాంక్ గేమ్ లో దీప్తి దొంగ ఏడుపు ఏడ్చిందని, ఎలిమినేషన్ జోన్ లో ఉండటం వలన సానుభూతి కోసం చేసిందని చెప్పుకొచ్చింది.

error: Content is protected !!