Devotional

ఈ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఏమి చేసిన చేయకపోయినా ఇలా చేస్తే ఎంతటి కటిక పేదవాడైన ధనవంతుడు అవుతాడు

ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది అదే విధంగా బాద్రపద మాసానికి కూడా తగిన ప్రాధాన్యత ఉంది. చాంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమినాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపదమాసం. ఈ మాసంలో పండుగల్లో ఒకటైన వినాయక చవితిని జరుపుకుంటాం. భాద్రపద మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే దారిద్య్ర బాధలు తొలగడంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెప్పుతున్నారు. . ఈ మాసంలో ఉప్పు, బెల్లం దానం చేయడం కూడా విశేష ఫలితాన్నిస్తుంది.

ప్రతి మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. ప్రతి పక్షంలోను ఒక ఏకాదశి ఉంటుంది. అంటే ఒక మాసంలో రెండు ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది. భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి వరివర్తనం చెందుతాడు.

అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సమాజంలోను, కుటుంబంలోను కరువుకాటకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజు సంధ్యాసమయంలో శ్రీమహావిష్ణువు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.వివాహం కాని అమ్మాయిలు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తే త్వరగా వివాహం అవుతుంది. ఈ రోజు అరటిపండ్లను నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి. భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానము చేసి విష్ణువును పూజించి ఉపవాసం ఉండి విష్ణుసహస్ర నామాలనుపఠించాలి . ఈ విధంగా చేయటం వలన కోటి జన్మల పుణ్యం దక్కుతుంది.