కత్తి మహేష్ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ లలో ఎవరికీ సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా?

వంద రోజులకు పైగా బిగ్ బాస్ ఇంట్లో ఢక్కామొక్కీలు తిని చివరి వారానికి ఐదుగురు కంటెస్టెంట్లు మిగిలారు. ఇక ఈ ఐదుగురి మధ్య బిగ్ బాస్ 2 టైటిల్ కోసం పోరాటం జరగనుంది. ఆల్రెడీ సండే నైట్ నుంచి ఓటింగ్ కూడా ప్రారంభమైంది. సామ్రాట్ వారం ముందే ఫైనల్స్ చేరుకోగా, కౌశల్, తనీష్, గీతామాధురి, దీప్తి నల్లమోతు తాజాగా ఫైనల్ వీక్ లో అడుగుపెట్టారు. దాంతో కంటెస్టెంట్ల అభిమానులు తమ ప్రచారాన్ని ఉధ్ధృతం చేశారు. కౌశల్ ఆర్మీ అయితే ఒకడుగు ముందుకేసి 2కె వాక్ లు, సోషల్ మీడియా క్యాంపెయిన్ లతో హోరెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 1 కంటెస్టెంట్, సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. తాను దీప్తి నల్లమోతుకు మద్దతు ఇస్తానని, ఆమె తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్నాడు. అదే సమయంలో కౌశల్ గురించి చెబుతూ… బిగ్ బాస్ హిస్టరీలోనే కౌశల్ లాగా చిరాకు తెప్పించే వ్యక్తిని ఎక్కడా చూడలేదు… విసుగుపుట్టించేలా మాట్లాడతాడు… కౌశల్ గనుక బిగ్ బాస్ 2 విన్నర్ అయితే మనమెంత ఇడియట్లమో ప్రూవ్ అవుతుంది… అంటూ కామెంట్ చేశాడు. అంతకుముందు ఓసారి కౌశల్ గురించి కామెంట్ చేస్తూ… కౌశల్ పాజిటివిటీ మొత్తం పోగొట్టుకున్నాడు…

హౌస్ నుంచి పంపేయడం బెటర్ అన్నాడు. దాంతో ఓ మహిళా నెటిజన్ కత్తి మహేష్ ను దిమ్మదిరిగేలా క్వశ్చన్ చేసింది. ఏంటి సర్ మీరు.. ప్రజలు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్లనే ఎక్కువగా పాయింటవుట్ చేస్తారు అంటూ అడిగింది. దానికి కత్తి మహేష్… ప్రజల అభిప్రాయం ఏంటనేది నాకు అనవసరం… నేను నమ్మిన దానికే కట్టుబడి ఉంటా… అంటూ సమాధానం చెప్పాడు. కత్తి మహేష్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నా మళ్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

error: Content is protected !!