Movies

కృష్ణ – శోభన్ బాబు మల్టీస్టారర్ సినిమాలకు దూరం కావటానికి అసలు కారణం?

తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీ స్టారర్ చిత్రాలకు ఒకప్పుడు కొదవలేదు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ కల్సి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ సమయంలో మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి చిత్రాలు,,ఆతర్వాత కాలంలో కలర్ సినిమాల్లో రామకృష్ణులు,సత్యం శివం ఇలా ఇద్దరి కాంబినేషన్ అదిరిపోయేది. పలుచిత్రాల్లో ఇద్దరూ కల్సి నటించారు. ఇక ఆతర్వాత చెప్పుకోతగ్గ జంట హీరోలుగా కృష్ణ – శోభన్ బాబు కల్సి పుట్టినిల్లు – మెట్టినిల్లు, మండే గుండెలు,ముందడుగు ఇలా వీళ్ళిద్దరూ కల్సి పలు చిత్రాల్లో నటించారు. హిట్ అయ్యాయి కూడా.

అప్పట్లో ఆయా హీరోల ఇమేజ్ లు ఆధారంగా చిత్రాలు రూపొందించి,మల్టీస్టారర్ తీసేవారు. ఫైటింగ్ సీన్స్,పాటలు ఇలా అన్నీ సమంగా ఉండి తీరాల్సిందే ఒకవేళ ఒకరికి తక్కువ మరొకరికి ఎక్కువ రోల్ వస్తే, అభిమానుల నుంచి విమర్శల వర్షం కురిసేది. ఆలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆరోజుల్లో హీరోల మధ్య గొడవలు, వివాదాలు లేకున్నా, అభిమానుల మధ్య పోటీ హీరోలను శాసించే స్థాయిలో ఉండేది.

ఫాన్స్ కి తలొగ్గే స్థితి నుంచి బయట పడలేక మల్టీస్టారర్ చిత్రాలను వద్దనుకునే దాకా పరిస్థితులు వెళ్లాయి.అలా కృష్ణ , శోభన్ బాబు ల నడుమ ఓ సినిమా విషయంలో అభిమానుల అహం దెబ్బతింది. అసలు ఇలాంటి చిత్రం ఎందుకు ఒప్పుకున్నారు, మీరు రోల్ చిన్నది,పైగా ఆడియన్స్ దృష్టిలో కూడా మీ పాత్ర తేలిపోయింది అంటూ అభిమానులు చెప్పేసరికి ఇక కల్సి నటించకూడదని శోభన్ బాబు గట్టి నిర్ణయం తీసుకున్నారట.

ఇంతకీ ఆ చిత్రం పేరేమిటంటే, మహా సంగ్రామం. ఇందులో కృష్ణ విప్లవ కారుని పాత్ర అయితే, శోభన్ బాబుది పోలీసు అధికారి పాత్ర.
చిత్రంలో సన్నివేశాల పరంగా కృష్ణకు కొంచెం ఎక్కువ ప్రాధ్యాన్యత ఆ చిత్రంలో కనిపిస్తుంది. పైగా డైలుగుల పరంగా కూడా కృష్ణ పాత్ర పవర్ ఫుల్. ఇక శోభన్ పాత్ర తేలిపోయింది. డైలాగులు కూడా అదే రీతిలో ఉన్నాయి. దీంతో శోభన్ బాబు అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇక దాంతో కృష్ణ, శోభన్ బాబు కల్సి నటించలేదు. అదండీ కథ.