గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ మూవీ – కండిషన్స్ ఏమిటో చూడండి

తెలుగు సినీ రంగంలో అందరినీ శాసించే హీరోలు ఉన్నట్టే, శాసించిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాగే దర్శకుల్లో కూడా ఖలేజా చూపిన వాళ్ళూ ఉన్నారు. ఇక నిర్మాతల విషయం తీసుకున్నా శాసించే వాళ్ళూ ఉన్నారు. అయితే ఇందులో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరొందిన అల్లు అరవింద్ అనగానే మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలకు దోహదపడ్డ నిర్మాతగా చెప్పితీరాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను చిరుతో నిర్మించారు. ముఖ్యంగా చిరంజీవి 1980దశకంలో దూసుకుపోవడానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రధాన భూమిక వహించింది. శుభలేఖ,పసివాడి ప్రాణం, అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు,విజేత, ఇలా పలు హిట్ చిత్రాలు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అరవింద్ తీశారు.

అలాగే పవన్ కళ్యాణ్,బన్నీ ఇలా అన్నీ మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలకే గీతా ఆర్ట్స్ పరిమితం అయింది. వేరే హీరోలతో సినిమాలు తీసినప్పుడు టై అప్ అయ్యేవారు తప్ప గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉపయోగించలేదు. కానీ,ఇప్పుడిప్పుడే గీతా ఆర్ట్స్ టు పేరుతొ విజయ్ దేవరకొండ వంటి వాళ్ళతో పిక్చరర్స్ చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాలనుంచి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయనతో మళ్ళీ మూవీస్ తీయాలని భావిస్తుంటే కుదరడం లేదు.

రామ్ చరణ్ సొంతంగా తన బ్యానర్ పై చిరుతో సినిమాలు చేసేస్తున్నారు. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 సక్సెస్ సాధించగా, తాజాగా సైరా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఆతర్వాత కొరటాల శివతో కూడా కమిట్ అయ్యారు. ఈ నేపధ్యంలోతాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద పిక్చర్ చేయడానికి అరవింద్ సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే మహేష్ బాబుని సంప్రదించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మహర్షి మూవీ చేస్తున్న మహేష్ ఆతర్వాత మైత్రీ సంస్థకు సుకుమార్ డైరెక్షన్ లో మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

దీంతో 2020 నాటికి గానీ మహేష్ ఖాళీ అవ్వడు. ఇక అప్పుడే చేయడానికి ఒకే చేయించారట. చిరుతో తీద్దామంటే వీలు కుదరనందున కొంత అసంతృప్తికి లోనైనా అరవింద్ ఇక లాభం లేదని మహేష్ ని కమిట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇవన్నీ ఎంతవరకూ నిజమో తెలియదు. గీతా ఆర్ట్స్ లో మహేష్ నటించనున్నట్లు అధికారికంగా వార్త రావాల్సి వుంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

error: Content is protected !!