Movies

పెళ్లి చూపులు షో కి అమ్మాయిలు ఎందుకు వచ్చారో తెలుసా…. అసలు కథ ఇదే?

బిగ్ బాస్ సీజన్ టు రియాల్టీ షో ముగియడంతో ఆ స్థానంలో ఏమి వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో మోస్ట్ బ్యాచిలర్ ప్రదీప్ పెళ్లిచూపులు స్టార్ట్ అయ్యాయి. స్వయంవరం లాంటి ఈ షోలో తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ప్రదీప్ పెళ్లి చేసుకోవడం ఈ షో ఉద్దేశ్యమని చెబుతున్నారు. అయితే ఈ షో గురించి మొదటి నుంచి వివాదం చెలరేగుతోంది. అసలు ఈ అమ్మాయిలను ఇలా షో కి పంపడం దారుణమని,మన సంప్రదాయానికి వ్యతిరేకమని,అసలు తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారని వంటి విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఈ షో మొదలై అప్పుడే 10 రోజులు దాటిపోయింది. అయితే ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ సుమ హోస్ట్ కావడం విశేషం.

ఈ పెళ్ళిచూపుల కోసం నాలుగు రకాలుగా వడపోత కార్యక్రమం చేపట్టారట. వేలాదిమంది దేశవిదేశాలనుంచి అప్లికేషన్ పెడితే,అందులో14మందిని సెలక్ట్ చేసారు. సెలెక్ట్ అయిన అమ్మాయిల మనోగతాలు,ఇష్టా ఇష్టాలు ప్రదీప్ తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తారు.

ఇప్పటికే ఓ అమ్మాయి బయటకు వచ్చేసింది. చివరకు మిగిలిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లాడతాడు. అయితే ఏకంగా 14మంది అమ్మాయిలు ప్రదీప్ మాచిరాజు కోసం దేశవిదేశాల నుంచి ఈ షోకి ఎందుకు వచ్చారు,సంప్రదాయాన్ని ఎందుకు వదిలేసారు వంటి ప్రశ్నల నేపథ్యంలో ఓ అసలు విషయం బయట పడింది.

అదేంటంటే, మోడలింగ్ రంగం లోనో,సినిమాలోనో,టీవీలోనో నటిస్తున్నవాళ్ళు, నటించాలని కోరిక బలంగా ఉన్నవాళ్లు ఈ షోకి వచ్చారట. అందుకే తమ నటన అంతా అక్కడ ఒలకబోస్తున్నారట. ఇక కన్నడ టివి రంగం నుంచి కూడా వచ్చినవాళ్లు ఉన్నారట. అయితే నిజంగా ప్రదీప్ ఈ షోలో చివరికగా నిల్చిన అమ్మాయిని పెళ్లి చేసి చేసుకుంటాడా లేదా, అసలు నిజంగా పెళ్ళిచూపులా, రియాల్టీ షోగానే మిగిలిపోతుందా వంటి ప్రశ్నలకు సమాధానం లేదు. అసలు ఈ షో అంతరార్ధము ఏమిటన్నది షో అయ్యేవరకూ చెప్పలేం అని అంటున్నారు.