Movies

ఆనంద్ సినిమాలో రాహుల్ కేరక్టర్ చేసిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే

టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదని అంటారు. నిజమే,అందుకే ఒక్కొక్కరు అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతారు. కానీ ఈ విషయం అందరికీ తెలీదు. సమయం వచ్చినప్పుడు ఛాన్స్ లు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. ఇంతకీ ఇదంతా ఎందుకంటే మనందరికీ మంచి కాఫీ లాంటి సినిమా ‘ఆనంద్’మూవీ గుర్తుంది కదా. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీలో హీరోయిన్ రూప పాత్రధారి కమిలిని ముఖర్జీ ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, అనుకోని పరిస్థితుల్లో ఆగిపోతుంది. అలా రూపతో మిస్సయిన రాహుల్ కేరెక్టర్ లో నటించిన వ్యక్తి అనూజ్ గుర్వారా. ఇతడి నటన ఆసినిమాలో బానే ఆకట్టుకుంది. అయితే యితడు కేవలం యాక్టర్ కన్నా ముందే చాలా రంగాల్లో రాణించాడు. మంచి సింగర్ కూడా. యాంకర్,డబ్బింగ్ ఆర్టిస్టు కూడానూ.

ఇంతకీ అనూజ్ గుర్వారా బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్తే,అతడు నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తి. 1981జూన్ 9న పుట్టిన అనూజ్ సైకాలజీ,ఎడ్వార్టైజింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఇతని కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయింది. ఇతడికి చిన్ననాటినుంచి మ్యూజిక్ అంటే చెవికోసుకునేవాడు. కాపీ రైటర్ గా, కంటెంట్ డవలపర్ గా కెరీర్ మొదలుపెట్టి,యాడ్స్,అడ్వార్టైజ్ కంపెనీల్లో పనిచేసాడు.

అయితే సంగీతంపై మక్కువతో ఎంటర్ టైన్మెంట్ రంగంవైపు దృష్టి పెట్టాడు. అలా 2005లో ఆలిండియా రేడియోలో ఆర్జేగా అడుగుపెట్టి, పలు షోలతో అలరించాడు. బెస్ట్ ఆర్జే అవార్డు కూడా ఆ ఏడాది అందుకున్నాడు. అలా తొలిసారి అవార్డు అందుకున్న అనూజ్ రేడియో సిటీ ఎఫ్ ఎం 91పాయింట్ లో ఆర్జే గా రీ ఛార్జి ప్రోగ్రాం చేసాడు. ఆ ప్రోగ్రాం ఎఫ్ ఎం రంగంలోనే ఓ ఊపు ఊపేసింది. 2008వరకూ అనూజ్ ప్రోగ్రామ్స్ తో దూసుకుపోయి, బెస్ట్ ఆర్జేగా అవార్డులు సొంతం చేసుకున్నాడు.

ఎఫ్ ఎం రంగంలో రాణిస్తున్న సమయంలోనే ఆనంద్ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆ సినిమాతో నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఇక అతనికి సంగీతం పై గల మక్కువ కూడా అనుకోని ఛాన్స్ వైపు నడిపించింది. ఎస్ ఎస్ రాజమౌళి మగధీర సినిమా తీస్తున్న సమయంలో కొత్త గాయకుడి చేత పాడించాలని ఎం ఎం కీరవాణి భావించి ఆడిషన్స్ జరిపాడు. అందులో అనూజ్ సెలెక్ట్ అయ్యాడు. అవ్వడమే కాదు సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడే మంచి ఛాన్స్ కొట్టేసాడు.

ఆ సినిమాలో ‘పంచదారా బొమ్మ ‘పాట ఎంతటి హిట్ చెప్పలేం కదా. అయితే ఆ పాట పాడింది అనూజ్ అని ఇప్పటికీ చాలామందికి తెలీదు. అప్పట్లో సెల్ ఫోన్స్ రింగ్ టోన్ గా మారుమోగింది పాట అది. అంతేకాదు తొలి ఫిలిం ఫెర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఆతర్వాత అల్లు అర్జున్ నటించిన వేదం,బద్రీనాధ్,అలాగే హీరో నాని నటించిన ఈగ,భీమిలి కబడ్డీ జట్టు,మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం,అది నువ్వే, గ్రాడ్యుయేట్,సిద్దార్ధ్ నటించిన అనగనగా ఒక ధీరుడు,ప్రేమ కావాలి,బ్రహ్మిగాడి ప్రేమకథ,ఏటీఎం వంటి సినిమాల్లో సింగర్ గా రాణించాడు.

ఇక ‘ఈగ’ హిందీ మూవీ ‘మక్కీ’లో పాటలు పాడడం తో పాటు నానికి హిందీలో డబ్బింగ్ చెప్పాడు. ఇక ఆర్టిస్టుగా కూడా ఆనంద్ మూవీతో రంగప్రవేశం చేసాడు. ఇలా పలు కోణాల్లో తన ప్రతిభను చాటుకుంటూ అనూజ్ తన సత్తా చాటుకున్నాడు. ఇక అతని తల్లిదండ్రులు యోగేంద్ర గుర్వారా,జ్యోతి గుర్వారా కూడా టాలెంటెడ్ పెర్సన్స్. ఎలాగంటే వీళ్ళిద్దరూ షేర్ హుడ్ పబ్లిక్ స్కూల్ పెట్టి పిల్లలకు చదువు చెబుతున్నారు.