Movies

హీరోయిన్ ప్రణీత గుర్తు ఉందా…ఆమె ఏ పని చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుందో చూడండి

మనం ఒకరికి సాయం చేస్తే,మనకి పదిమంది సాయపడతారన్న సామెతను చాలామంది బానే వంటబట్టించుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ సేవా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు కూడా తమవంతు సాయం అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ సైతం అందం,అభినయం మెయింటేన్ చేయడంతో పాటు సేవలో కూడా భాగం పంచుకుంటున్నారు. పదిమందికీ ఆదర్శంగా ఉంటున్నారు. అందులో ప్రధానంగా ‘ఏం పిల్లో,ఏం పిల్లడో’అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ ప్రణీతను ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఓ స్కూల్ ని దత్తత తీసుకున్న ప్రణీత, తర్వాత మరికొన్ని పాఠశాలలను దత్తత తీసుకుంటుందట.

బాబు చెక్కిన బొమ్మలా ఉండే ప్రణీత మొదటి చిత్రంతోనే తెలుగువాళ్ళ హృదయాలను కొల్లగొట్టింది. బెంగుళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెప్పడానికి సిద్ధపడింది. అయితే ఆసమయంలో అక్కడి పిల్లలు ఎలా వుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏమిటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించింది.

కనీస అవసరాలు కూడా పాఠశాలలో లేవన్న విషయాన్ని గ్రహించింది. ఇంగ్లీషులో పరిజ్ఞానం కూడా లేదని గమనించింది. అందుకే ఓ పాఠశాలను దత్తత తీసుకుని, ఏదో ఆషామాషీగా కాకుండా చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేయాలని భావించింది. ఫస్ట్ ప్రయారిటీ, పాఠశాల రూపురేఖల్ని మార్చాలని నిర్ణయించుకున్న ప్రణీత,హసన్ జిల్లా ఆలూరులోని ఓ పాఠశాలను దత్తత తీసుకుంది. నిజానికి వాళ్ళ సొంతూరు ఆలోరేనట. అయితే వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారని ప్రణీత చెప్పుకొచ్చింది.

అందుకే పుట్టిన ఊరులో స్కూల్ ని దత్తత తీసుకున్నానని , ముందుగా 5లక్షలు కేటాయించానని వివరించింది. ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించి,ఆతర్వాత రూపురేఖల్ని మార్చేసి, విధాబోధనలో కూడా మార్పు తెస్తామని వివరించింది.