Politics

అన్నబాటలోనే తమ్ముడు కూడానా – జనసేనను ఏమి చేస్తాడు

సినిమా నటులు రాజకీయాలకు కొత్తకాదు. తమిళనాడులో ఎంజీఆర్ ,ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సొంత ఎజెండాతో అధికారం అందుకుని, తమ సత్తా చాటారు. అయితే ఇలా అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే విశేషమైన అభిమాన జనం గల మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి,కేవలం 18సీట్లు దగ్గరే తన స్కోర్ ఆపేసాడు. కొన్నాళ్ళు తిరిగేసరికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసాడు. రాజ్యసభకు నామినేట్ అవ్వడం ద్వారా కేంద్రమంత్రి అయ్యాడు. ఇప్పుడు పదవి కూడా అయిపోవడంతో కాంగ్రెస్ కి దూరంగానే ఉంటూ సినిమాల పైనే పూర్తిగా దృష్టి పెట్టాడు.

ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. పవన్ జనసేన పేరిట గత ఎన్నికల్లోనే పార్టీ పెట్టినా పోటీకి దూరంగా ఉండిపోయి, బిజెపికి – టిడిపి కి మద్దతు ఇస్తూ ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు టిడిపితో విభేదించి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, ప్రజల మధ్య తిరుగుతున్నారు. అయితే బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదని విమర్శలు వస్తున్నాయి. అన్నలాగే పార్టీ పెట్టిన తమ్ముడు కూడా అన్నలాగే దూకుడు ప్రదర్శిస్తున్నాడని, చివరికి విలీన దిశగా వెళ్తున్నాడని విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో బిజెపి అట్టర్ ప్లాప్ అవ్వగా, ఆ పార్టీ డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్, జగన్ లు మోడీ చెప్పినట్లు ఆడుతున్నారని ఇప్పటీకే టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. దీనికి తోడు బిజెపిని ఏమీ తినకపోవడం చూస్తుంటే, ఈ మూడు కల్సి కూటమిగా ఏర్పడతాయన్న అనుమానాలు వస్తున్నాయి.

అయితే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్టే,రేపొద్దున జనసేనను బీజేపీలో విలీనం చేయడన్న గ్యారంటీ ఈముందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బీజేపీలో పార్టీని విలీనం చెస్తెస్తే బిజెపి అభ్యర్థిగా పవన్ పేరుని ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది. గతంలో చిరంజీవిని నమ్ముకుని ప్రజారాజ్యంలో చేరిన వర్గాలు ఆతర్వాత తీవ్రంగా నష్టపోయి, ఇప్పటికీ కోలుకోలేదని, ఇప్పుడు పవన్ కూడా అదే పని చేస్తే చేసేదేముంటుందని పలువురు గుసగుసలాడుతున్నారు.