Movies

ఈ కమెడియన్ జీవితంలో జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకున్నాడో చూడండి

తెలుగు భాష అదృష్టమో ఏమో గానీ ఏ భాషలోనూ లేని కమెడియన్స్ తెలుగు లోనే ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 70మంది కమెడియన్స్ వున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. రేలంగి మొదలుకుని,రమణారెడ్డి,రాజబాబు,బ్రహ్మానందం,ఆలీ ,బాబూమోహన్,సునీల్,ఇలా ఎందరో తెలుగు కమెడియన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూ వచ్చారు. ఇంకా చాలామంది నవ్విస్తూనే ఉన్నారు. నవ్వులు పూయించే కమెడియన్స్ లో దువ్వాసి మోహనరావు ఒకడు. నిజానికి ఇండస్ట్రీలోకి నిర్మాత గా అడుగుపెట్టి అన్నీ కోల్పోయి, చివరకు కమెడియన్ గా స్థిరపడ్డాడు. సంధ్యారాణి అనే యువతిని పెళ్లాడిన దువ్వాసికి స్నేహ అనే కూతురు ఉంది.

నటులుగా వచ్చి నాలుగు డబ్బులు సంపాదించాక నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన వాళ్ళను చూస్తున్నాం . కానీ ఫైనాన్షియర్ గా,నిర్మాతగా అడుగుపెట్టిన దువ్వాసి కరీం నగర్ జిల్లా జైగిత్యాల కు చెందిన వ్యక్తి. తండ్రి గంగారాం,తల్లి మాణిక్యమ్మ. అయితే ఇండస్ట్రీలో నిర్మాతగా గొప్ప పేరు తెచ్చేసుకోవాలన్న ఆశతో హైదరాబాద్ చేరుకున్న దువ్వాసి తనలాంటి ఆలోచన గల ఓ డాక్టర్ తో కల్సి నిర్మాతగా అడుగుపెట్టాడు. ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు లేకుండా రావడం వలన కోలుకోలేని దెబ్బతిన్నాడు.

అప్పులపాలై అన్నీ అమ్మేసుకున్నాడు. ఇక రోడ్డ్డున పడుతున్న సమయంలో నటుడిగా ఛాన్స్ ల కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. సర్కస్ సత్తిపండు ,కోరుకొన్న ప్రియుడు,జయం,లక్ష్మి నరసింహ,నా ఆటోగ్రాఫ్,అమ్మాయి బాగుంది చిత్రాల్లో చేసిన కామెడీ నటనకు ఆడియన్స్ లో మంచి గుర్తింపు లభించింది. ఫేస్ కామెడీ గా ఉండడంతో అలాంటి పాత్రలే వరిస్తున్నాయి. రేసుగుర్రం, పిల్లా నువ్వులేని జీవితం,బ్యాండ్ బాజా, తమాషా రాజా వంటి చిత్రాల్లో నటించాడు. అయితే కమెడియన్ గా రాణిస్తున్న దువ్వాసి మళ్ళీ నిర్మాణ రంగంవైపు చూడకుండా జాగ్రత్త పడ్డాడు.