Devotional

ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది

డిసెంబర్ 18 ముక్కోటి ఏకాదశి రోజు ఏమి చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. అంతేకాక జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. మన హిందూ సంప్రదాయంలో కొన్ని పండుగలు శైవ తత్వాన్ని, కొన్ని పండుగలు వైష్ణవ తత్వాన్ని భోదిస్తాయి. అయితే విష్ణువును ఆరాధించే వారికీ ఈ ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన పండుగ. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు వైకుంఠంలో సకల అలంకరణలు చేసుకొని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇస్తారు.

ఈ ఏకాదశి రోజు విష్ణు మూర్తికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు మూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు. అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంది. అందువల్ల మనం ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయానికి వెళ్లి విష్ణు మూర్తిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి. అయితే విష్ణు మూర్తి దర్శనం సూర్యోదయానికి ముందు చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది.

ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువును దర్శించుకొని పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.

ఈ ముక్కోటి ఏకాదశి రోజున విషు మూర్తికి దీపారాధన చేసి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈ రోజు చేసే పూజలు,దానాలు అన్ని సంవత్సరంలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది