Politics

KCR ఎన్నికల ముందు రోజు ఏమి చేసారో తెలుసా? అదే KCR ని గెలిపించిందా?

పూర్వం రాజుల కాలంలో చేసినట్టు చెబుతున్న రాజశ్యామల యాగం ఈరోజుల్లో ఎవరూ చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే పూజలు,హోమాలు పట్ల శ్రద్ధ గల తెలంగాణా సీఎం కేసీఆర్ అంత్యంత భక్తిశ్రద్ధలతో ఈ యాగం జరిపారు. ఇదే ఆయన మళ్ళీ సీఎం కావడానికి దోహదపడిందని పలువురు చర్చించుకుంటున్నారు. . ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ,119 సీట్లకు గాను 88స్థానాల్లో టిఆర్ ఎస్ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్,టిడిపి,సిపిఐ,టీజె ఎస్ లతో కూడిన ప్రజా కూటమి ఓటమి పాలైంది. ఇక గతంలో ఆయుధ చండీ యాగం నిర్వహించారు. చిన్న జీయర్ స్వామి శిష్యులు ఈ యాగం నిర్వహించారు.

గజ్వేలు నుంచి కేసీఆర్ ఘనవిజయం నమోదు చేసుకోగా, ఆయన కొడుకు కేటీఆర్ సిరిసిల్ల నుంచి రెండోసారి ఘనవిజయం సాధించారు. ఇక కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు లక్షకు పైగా మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే కాదు, ప్రత్యర్థులకు డిపాజిట్ గల్లంతు చేసారు. కాంగ్రెస్ హేమాహీమీలు ఓడిపోయారు.

ఇంతకీ కేసీఆర్ చేసిన రాజశ్యామల యాగం అంత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడమే టిఆర్ ఎస్ గెలవడానికి కారణమని అంటున్నారు. ఈ మహా యాగమే కేసీఆర్ విజయాలకు కారణమని శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెబుతున్నారు.వేద పండితులు ఫణి శశాంక్ శర్మ, గోపికృష్ణ శర్మ పర్యవేక్షణలో 120 మంది రుత్వికులు ఈ యాగ నిర్వహణలో పాల్గొన్నారు.

కేసీఆర్ దంపతులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ యాగం పూర్తిచేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఈ యాగంలో పాల్గొన్నారు. జన్మ నక్షత్రాలను బట్టి ఈ యాగం చేస్తే ఫలితం వస్తుందని,ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఫలితం ఉండదని కూడా వేదపండితులు చెబుతున్నారు. కేసీఆర్ కి మాత్రం ఈ యాగం బాగా కలిసి వస్తుందని స్పష్టం చేసారు. ఫలితాల్లో అదే రుజువైంది.