Movies

మహేష్ కొత్త సినిమా టైటిల్ ఎంత వెరైటీగా ఉందో చూడండి

మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . మహర్షి చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యాక అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న చిత్రానికి ” వాట్సాప్ ” అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది .

వాట్సాప్ అనే టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఎఫ్ 2 అనే టైటిల్ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు అనిల్ రావిపూడి దాంతో వాట్సాప్ అనే టైటిల్ పట్ల వ్యతిరేకత రాకపోవచ్చు . అయితే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రానికి వాట్సాప్ అనే టైటిల్ ఏంటి ? అన్న చర్చ అయితే రావడం ఖాయం . అనిల్ రావిపూడి దర్శకుడిగా వరుసగా నాలుగు సూపర్ హిట్ లను ఖాతాలో వేసుకున్నాడు దాంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఈ దర్శకుడికి .