హోండా 6జీ వచ్చేస్తోంది.. విశేషాలు ఇవే..

మనదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ హోండా యాక్టివా. ఆడమగా, ముసలీముతకా అందరూ దాన్ని తెగ నడిపించేస్తుంటారు. అందుకే హోండా కంపెనీ దీనికి ఎప్పటికప్పుడు కొత్త మెరుగులు దిద్దుతూ మార్కెట్లోకి వదులుతుంటుంది. యాక్టివా 5జీ బండ్లను ఇప్పటికే తీసుకొచ్చిన కంపెనీ 6జీ మోడల్‌ను కూడా సిద్ధం చేసింది. దీనికి పరీక్షలు నిర్వహిస్తున్నారని, త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు మీడియాకు లీక్ అయ్యాయి.

ప్రత్యేకతలు..
5జీ మోడల్‌లోని అన్ని ఫీచర్లతోపాటు అదనపు ఫీచర్లను రంగించారు. ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ అండ్ డిస్క్ బ్రేక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వెనుకవైపు డ్రమ్ బ్రేక్ యూనిట్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్, సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. మోడల్ 5జీ కంటే కొంత స్లిమ్‌గా కనిపిస్తోంది. ధర.. 5జీకంటే రూ. 5వేల నుంచి 10 వరకు ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే హోండా ఈ మోడల్‌పై ఇంతవరకు అధికార ప్రకటనేదీ చేయేదు.

error: Content is protected !!