ఫ్లిప్‌కార్ట్ బొనాంజా.. ఆఫర్స్ అదుర్స్..

ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘మొబైల్స్ బొనాంజా’ పేరుతో పలు ఫోన్లపై ఆఫర్ల వర్షం కురిపించింది. ఈ ఆఫర్ ఈ నెల 28వరకు ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, బండిల్డ్ పేమెంట్ ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు మరో 5శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.

ఈ ఆఫర్‌లో పోకో ఎఫ్1 (6జీబీ,128 జీబీ) ధర రూ.24,999 నుంచి రూ.20,999లకు తగ్గించగా.. రియల్ మీ 2 ప్రొ ధరను రూ.3 వేలు తగ్గించి రూ.11,990లకే అందుబాటులో ఉంచింది. వీవో వై81 (3జీబీ, 32జీబీ) ధరను రూ.13,990 నుంచి రూ.8,490కి తగ్గించింది. ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 అసలు ధర రూ.10,999 కాగా.. రూ.7,999కి లభించనుంది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1 ధరను రూ.8,999 నుంచి రూ.6,499కి తగ్గించింది. జెన్‌ఫోన్ లైట్ ఎల్1 అసలు ధర రూ.6,999 కాగా.. రూ.4,999కే విక్రయానికి ఉంచింది.

జెన్‌ఫోన్ 5జడ్ ధరను రూ.32,999 నుంచి రూ.24,999కి తగ్గించింది. అలాగే ఆనర్ 10 లైట్ రూ.11,999, ఆనర్ 9 లైట్ ధరను ఏకంగా రూ.6 వేలు తగ్గించి రూ.7,999కే లభించనుంది. ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3ఎక్స్ (3జీబీ, 32 జీబీ) ధరను రూ.4 వేలు తగ్గించి రూ.6,999కే అందుబాటులో ఉంది. వీటితోపాటు శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎస్8, నోకియా 5.1 ప్లస్ (3జీబీ, 32జీబీ), ఒప్పో ఎఫ్11 ప్రొ, గూగుల్ పిక్సెల్ 3 సిరీస్‌ ఫోన్లపైనా కూడా భారీ ఆఫర్లు అందిస్తోంది.

error: Content is protected !!