రూ.4499 కే రెడ్‌మి స్మార్ట్‌ఫోన్.. ఈరోజే ఫ్లిప్‌కార్ట్ సేల్

చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మి గో పేరుతో అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.4499 మాత్రమే. రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్ మరోసారి ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 26 మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 100 జీబీ డేటా అదనంగా పొందొచ్చు.

రెడ్‌మి గో ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే

1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌

720×1280 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషనన్‌

ఆండ్రాయిడ్‌8.1 ఓరియో (గో ఎడిషన్‌)

1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌

8 మెగా పిక్సల్ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌

5 ఎంపీ సెల్ఫీ కెమెరా

3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

error: Content is protected !!