Healthhealth tips in telugu

Brinjal Benefits : వంకాయ తింటే షుగర్ తో పాటు ఈ వ్యాధులు దూరం..

Vankaya Health Benefits : వంకాయను ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారు. వంకాయ సొలనేసి కుటుంబానికి చెందినది. వంకాయ సాధారణంగా గుండ్రంగా లేదా సన్నగా,పొడవుగా ఉంటాయి. వంకాయకు నిగనిగలాడే చర్మం ఉంటుంది. వంకాయ లోపల భాగం మృదు కణజాలము మరియు అనేక చిన్న కేంద్రాల ఏర్పాటుతో క్రీమ్ రంగుతో మృదువైన విత్తనాలు ఉంటాయి. వంకాయ కూరను అందరూ ఇష్టంగా తింటారు. వంకాయను అందరు తింటారు.

కానీ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు వంకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వంకాయలో ప్రోటీన్,విటమిన్ సి మరియు ఇనుము, కాల్షియం,పొటాషియం,ఫాస్పరస్,ఫోలిక్ ఆమ్లం,బీటా కెరోటిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. వంకాయలో ఫైబర్ మరియు పిండిపదార్థాలు సమృద్ధిగా ఉండుట వలన మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటమే కాకుండా గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తుంది.

వంకాయలో ఫినాల్స్ మరియు అత్యల్ప గ్లైసెమిక్ సూచిక ఉండడం వలన మధుమేహ రోగులకు ఉత్తమ ఆహారం అని చెప్పవచ్చు. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్స్,ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడుతుంది. అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలు మలబద్దకం,గ్యాస్,అల్సర్ వంటివి తగ్గుతాయి. వంకాయను మెత్తగా మేష్ చేసి దానిలో ఇంగువ మరియు వెల్లుల్లి తో టాపింగ్ చేసుకొని తీసుకుంటే మూత్రనాళం సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

వంకాయలో అధికంగా ఫైబర్,నీరు తక్కువగా కేలరీలు ఉంటాయి. అందువల్ల వంకాయ తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో తీసుకొనే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతాం. శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయాపడుతుంది. వంకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఒక ప్రభావవంతమైన యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి.

వంకాయ రసాన్ని అరచేతులు మరియు అరికాళ్ళకు రాస్తే చెమట పట్టటం తగ్గుతుంది. అంతేకాక శరీర వాసనలను తగ్గిస్తుంది. వంకాయలో దాదాపు సోడియం తక్కువగా ఉండుట వలన అధిక రక్తపోటును నిరోధిస్తుంది. గుండె జబ్బులు,స్ట్రోక్ మరియు మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్నికూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.