Politics

టీడీపీ ఓడితే నందమూరి కుటుంబం నుండి తిరుగుబాటు ఉంటుందా….లేటెస్ట్ టాక్?

విద్యార్థికి పరీక్ష ఎలాగో రాజకీయ పార్టీలకు ఎన్నికలు అలాగే ఉంటాయి. అధికారం చేతికి రావాలంటే ,ఉన్న అధికారం నిలబెట్టుకోవాలంటే ప్రజలు ఇచ్చే తీర్పు పైనే ఆధారపడి ఉంటుదని చెప్పాలి. అందుకే తమ సర్వశక్తులు ఒడ్డి పోరాడతారు. అలాగే ఏపీలో ఎన్నికల సందడి ఆంధ్రప్రదేశ్ లో సందడిగా ముగిసాయి. అధికార టీడీపీ మళ్ళీ అధికారం దక్కించుకోవాలని,విపక్ష వైసిపి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని జీవన్మరణ సమస్యగా భావించి ఎన్నికల రణరంగంలో దూకారు. వాడీవేడీ విమర్శలతో వాతావరణం హీటెక్కించారు. ఇక పోలింగ్ ముగిసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారు. 
అయితే గెలుపు తమదంటే తమదని వైసిపి,టిడిపి గట్టిగా చెబుతూ వస్తున్నాయి. కానీ సర్వేలు వైసిపికి అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో టిడిపి ఓడిపోతే పరిణామాలు ఎలా ఉంటాయోనని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు సీనియర్స్ ని కాదని లోకేష్ ని అందలం ఎక్కించడమే చాలామందికి ఇష్టంలేదని అంటున్నారు. దీంతో ఓ వర్గం అదనుకోసం ఎదురుచూస్తోంది,ఫలితాల తర్వాత గళం విప్పనుందని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను పక్కన పెట్టేయడం,లోకేష్ ని అందలం ఎక్కించడం ఏమిటని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఇక బాలయ్య కూడా అసంతృప్తితో ఉన్నప్పటికీ కొంచెం సైలెంట్ అయ్యాడని,ఫలితాల తర్వాత గర్జిస్తాడని,అప్పుడు సీనియర్స్ ఆయన వైపు వెళ్తారని అంటున్నారు.

టిడిపి ఓడిపోతే వయస్సు రీత్యా ప్రతిపక్షంలో చంద్రబాబు కూర్చోవడం కష్టమని, అప్పుడు లోకేష్ ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించకూడదని కూడా కొందరు సీనియర్స్ అంటున్నారట. బాలయ్య తిరుగుబాటు చేస్తే అండగా నిలవాలని సీనియర్స్ అంటున్నారట. బాబయ్య సారధ్యం వహిస్తే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇష్టమేనని అంటున్నారట. ఇదంతా చంద్రబాబు ఊహించి లోకేష్ కి ఎన్నికల సమయంలో ప్రయారిటీ తగ్గించి,మంగళగిరికి పరిమితం చేసారని,లో ప్రొఫైల్ ఉండేలా చూసారని అంటున్నారు. ఇక లోకేష్ చేతిలో సారధ్యం ఉండడం పార్టీలో మొదటినుంచి ఉన్నవారికి అసలు మింగుడు పడడంలేదని,ఇక సదరు సామాజిక వర్గానికి కూడా లోకేష్ కి సారధ్యం ఇవ్వడం ఇష్టం లేదని అంటున్నారు. మొత్తానికి టిడిపి కనుక ఓడిపోతే ఆ పార్టీలో తిరుగుబాటు వస్తుందా, సజావుగా ఉంటుందా అనేది చూడాలి.