Beauty Tips

వేసవికాలంలో వేధించే చెమట పొక్కులు,దురద పోవాలంటే…ఇలా చేస్తే సరి

Chemata Pokkulu Thaggalante Emi Cheyali : వేసవి కాలం వచ్చేసింది. ఈ వేసవిలో ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. విపరీతమైన ఎండ కారణంగా చెమట కాయలు, దురదలు రావటం సహజమే. చెమట కాయలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. వీటి వల్ల చర్మం దురద పెట్టడమే కాదు, తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. 

చెమట కాయలు దురదకు కారణమై, చికాకు, ఆయా భాగాలలో మంట, నొప్పికి దారితీస్తాయి. అతిగా చెమట పట్టే వారిలో వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.  సాధారణంగా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు వస్తుంటాయి.వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం చర్మం చిట్లి రక్తం కారడం జరుగుతుంది.

అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో చాలా సులభంగా చెమట కాయలను వాటి కారణంగా వచ్చే దురదను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవన్నీ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే. ఈ చిట్కాను చేయటం కూడా చాలా సులువు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రిడియన్స్ మరియు చేసే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద,ఒక స్పూన్ ముల్తానీ మిట్టి,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చెమట పొక్కులు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే చెమట పొక్కులు,దురద పోతాయి.