పవన్ ఎక్కడ గెలుస్తాడు?ఎక్కడ ఓడతాడు?

ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ అధినేత నియాజకవర్గం అంత్యంత కీలకం అవుతుంది. పార్టీని నడిపించే అధినేత సీటు అంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. అధికార టిడిపి అధినేత చంద్రబాబుకి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కంచుకోట. అలాగే వైసిపి అధినేత జగన్ కి కడప జిల్లా పులివెందుల కంచుకోట. అయితే కొత్తగా వచ్చిన జనసేన ఈసారి బరిలో దిగింది. ఆపార్టీ అధినేత రెండు నియోజక వర్గాలను నుంచి పోటీచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం,విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలో దిగిన పవన్ కళ్యాణ్ గెలుపు ఓటములపై వివిధ రకాల సమీక్షలు కూడా వచ్చేసాయి.

ఇంకా వస్తున్నాయి. గాజువాకలో 30వేల మెజార్టీతో పవన్ గెలుస్తాడని జనసేన లెక్కలు తేల్చి చెబుతున్నాయి. నిజానికి ఇక్కడ టీడీపీ కన్నా వైసిపి గట్టి పోటీ ఇచ్చింది. అదేవిధంగా భీమవరం లో వైసిపి నేత గ్రంధి శ్రీనివాస్ పోటీలో నిల్చి, పవన్ కి గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ కూడా టిడిపి వెనకబడింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన గ్రంధి శ్రీనివాస్ మీద సానుభూతి తో పాటు నియాజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం కల్సి వస్తుందని లెక్కలేస్తున్నారు.

ఇక గత రెండు దఫాలుగా పోటీచేస్తున్న పులవర్తి ఆంజనేయులు మరోసారి టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ పవన్,గ్రంధి శ్రీనివాస్ ల మధ్యనే బలంగా పోటీ నడిచిందని అంటున్నారు. ఇక గాజువాకలో గెలుస్తున్నట్టు జనసేన లెక్కలు వేస్తున్నప్పటికీ భీమవరం విషయంలో అంతలా చెప్పలేకపోతున్నారు. లెక్కింపు చేపడితేనే ఎవరి భవితవ్యం ఏమిటో తేలేది. 

error: Content is protected !!