హాంగ్ వస్తే పవన్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని అంటారు. ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఇక ఏపీలో ఏప్రియల్ 11న పోలింగ్ ముగిసి నెల అవుతోంది. మే23న ఫలితాలు రానున్నాయి. తామే గెలుస్తామంటే ,తామే గెలుస్తున్నామని ఎవరికి వారే అంచనాలు, విశ్లేషణలు చేసేస్తున్నారు. అయితే ఎవరికీ మెజార్టీ రాకుండా హంగ్ వస్తే ,ఏమిటి పరిస్థితి అనే మాట కూడా బలంగానే వినిపిస్తోంది.. 

అధికార టీడీపీ, విపక్ష వైసిపి తమదే అధికారం అంటే తమదేనని గట్టిగా చెబుతున్నారు . కానీ యూత్ లోకి దూసుకెళ్లిన జనసేన కూడా తమదే అధికారం అని చెబుతోంది. అధికారం రాకపోయినా కింగ్ మేకర్ అవుతామని జనసైనికులు అంటున్నారు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ తదితర జిల్లాల్లో టీడీపీ,వైసీపీలకు జనసేన గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాదు,కృష్ణా,గుంటూరు,నెల్లూరు వంటి జిల్లాల్లో కూడా జనసేన గట్టి సవాల్ విసిరింది. 

జనసేన సీట్లు గెలవక పోవచ్చు కానీ,కనీసం నియోజకవర్గానికి 30వేల ఓట్లు తెచ్చుకునే సత్తా జనసేనకు ఉందని అంటున్నారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలో హంగ్ వస్తే , పవన్ ఎవరికి సపోర్ట్ చేస్తారన్న చర్చ నడుస్తోంది. టిడిపి,వైసీపీలకు 70సీట్ల చొప్పున వచ్చాక, ముప్పై సీట్లలో జనసేన వస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారన్న దాని గురించి అందరిలో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ కూడా జరగటం  విశేషం. చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడని 95శాతం బెట్టింగ్ కడుతుంటే,మిగిలిన ఐదు శాతం జగన్ కి మద్దతిచ్చే ఛాన్స్ ఉందని బెట్టింగ్ వేస్తున్నారు. 

error: Content is protected !!