ప్రజారాజ్యం పార్టీని మీడియా సంస్థలే దెబ్బతీశాయట… షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు

ఒకప్పుడు మీడియా అంటే పారదర్శకంగా ఉండేది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఇప్పుడు మీడియాలో కూడా తేడాలొచ్చాయి. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్లు ఇప్పుడు వాళ్ల‌కు కావాల్సింది కూడా చూపించుకుంటున్నారు. అలాగ‌ని మీడియా మొత్తాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం కూడా క‌రెక్ట్ కాదు. నిజానికి ఈ రోజుల్లో ఎక్క‌డ ఏం జ‌రిగినా కూడా జ‌నాల ముందుకు రావాలంటే, మీడియా ఉండాలి. వాళ్లుంటేనే ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతుంది అనేది వాస్తవమే. అయితే తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మీడియా తీరుపై సంచలన వ్యాఖ్య‌లే చేసాడు. అస‌లే ఇప్పుడు టీవీ 9 ర‌విప్ర‌కాశ్ ఇష్యూతో మీడియాపై ప్ర‌జ‌ల్లో కూడా మంచి చ‌ర్చ జరుగుతున్న స‌మ‌యంలో నాగ‌బాబు కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు.

తమ కుటుంబానికి మీడియా చేసినంత అన్యాయం.. దుర్మార్గం ఇంకెవ‌రూ చేయ‌లేద‌ని నాగబాబు వాపోయాడు. ఈ మాట‌లు విన్న త‌ర్వాత అంతా షాక్ అవుతున్నారు. మెగా కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుని.. వాళ్ల సినిమాల‌ను అంత‌గా ప్ర‌మోట్ చేస్తున్న మీడియాపై నాగ‌బాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదట. ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు చిరంజీవి రేంజ్ వేరు. కానీ పార్టీ పెట్టిన త‌ర్వాత ఆయ‌న ప‌రిస్థితికి కార‌ణం మీడియా అని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా నాగ‌బాబు మాట్లాడుతూ, ‘అప్ప‌ట్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండింటికి వ‌త్తాసు ప‌లికే ఛానెల్స్ ఉండ‌టం.. కావాల‌నే చిరంజీవిపై దుర్మార్గం చేయ‌డంతోనే ఆయ‌న‌కు ఆ ప‌రిస్థితి వచ్చింది’ అని చెప్పాడు.

గ‌తంలో కూడా చిరుకు మీడియా స‌పోర్ట్ లేదు కాబ‌ట్టే రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయార‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇప్పుడు రిపీట్ చేసాడు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సాక్షి కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కొన్ని మీడియా సంస్థలు చిరంజీవి ప‌ట్ల మరీ దారుణంగా ప్రవర్తించాయని నాగబాబు చెప్పుకొచ్చాడు. 

ఒక‌వేళ చిరు కానీ రాజ‌కీయాల్లో స‌క్సెస్ అయితే.. ఎక్క‌డ త‌మ పొలిటికల్ కెరీర్‌కి బ్రేక్ ప‌డుతుంద‌న్న భ‌యంతో చాలా వ్యూహాత్మకంగా చిరంజీవికి స‌పోర్ట్ చేస్తున్న‌ట్లుగానే న‌టిస్తూ, ఆయ‌న వ్యక్తిత్వాన్ని నాశ‌నం చేసేలా కథనాలు రాసార‌ని నాగబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. మొత్తానికి ప్ర‌జారాజ్యం పార్టీ వైఫ‌ల్యంలో మీడియా కూడా ప్ర‌ముఖ పాత్ర పోషించిందంటున్నాడు.అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియా ఉంది కాబ‌ట్టి త‌మ‌పై జ‌రుగుతున్న మీడియా దాడులను కాస్తైనా ఎదుర్కొంటున్నామ‌ని, అప్పుడు ఇలాంటివి లేవు కాబ‌ట్టి ఇబ్బంది ప‌డ్డామ‌ని నాగ‌బాబు చెప్పాడు. 

error: Content is protected !!