ప్రజారాజ్యం పరిస్థితి రిపీట్ కాకూడదు అంటూ పవన్ సెన్షేషనల్ కామెంట్స్

పోలింగ్ ముగిసి ఇక ఫలితాలకోసం నిరీక్షణ చేస్తున్న సమయంలో ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. ఎవరికెన్ని సీట్లు వస్తాయో,హంగ్ వస్తే ఏమౌతుంది వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీలకు ధీటుగా జనసేన కూడా పోటీ ఇచ్చింది. జనసేన గెలుస్తుందా,జయాపజయాలపై ప్రభావం చూపిస్తుందా అనే చర్చ కూడా నడుస్తోంది. తాజాగా జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ మధ్యాహ్నం వరకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.ముఖ్యంగా అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపై ఈ భేటీలో ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

భేటీ అనంతరం మీడియాతో మట్లాడిన జనసేన నాయకులు ఈ విషయాల్ని వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీపై ఉద్దేశ పూర్వకంగా కుట్రలు చేసిన వైనాన్ని నేటి జనసేన నాయకులకు పవన్ నిశితంగా వివరించారు. టాలీవుడ్ మెగాస్టార్ రాజకీయాల్లోకి ప్రవేశించి , 2008 ఆగష్టు 26న తిరుపతి వేదికగా ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో వైఎస్ హవా నడుస్తోంది. దీంతో ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. దీంతో పీఆర్పీలో చేరినవారంతా ఒక్కొక్కరిగా బయటకు వచ్చేశారు.

దీంతో 2011లో కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని చిరంజీవి విలీనం చేసేశారు. దీనిపై అప్పట్లో పవన్ కూడా విభేదించారు. ఈనేపధ్యంలో జనసేన సమీక్షలో పవన్ పలు అంశాలపై మాట్లాడారు. అన్న ప్రజారాజ్యంలాగానే… తమ్ముడు కూడా జనసేన పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తాడన్న వార్తలపై కూడా పవన్ స్పందించినట్లు టాక్. భవిష్యత్తు తరాల్ని దృష్టిలో ఉంచుకుని ఆదర్శవంతమైన రాజకీయం చేయాలని ఈ సందర్భంగా పవన్ నేతలకు సూచించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులకు ఎదురయ్యే అనుభవాల్ని పవన్ అడిగి తెలుసుకున్నారు. సమాజంలో మార్పు కోసమే జనసేన ఆవిర్భవించిందని పవన్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో మార్పు కొంతవరకు కనిపించిందన్నారు. త్వరలో ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ పర్యటించ బోతున్నట్లు తెలుస్తోంది. 

error: Content is protected !!