ఐడియా కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఏడాదిపాటు రోజుకు 1.5 జీబీ!

ప్రముఖ టెలికం కంపెనీ ఐడియా తాజాగా మరో రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ఆవిష్కరించింది. రూ.999, రూ.1,999 ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి రెండు లాంగ్ టర్మ్ వాలిడిటీ ప్లాన్లు. ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ ఏడాది. 

రూ.999 ప్రిపెయిడ్ ప్లాన్‌లో 12 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ కేవలం పంజాబ్ సర్కిల్‌కు మాత్రమే పరిమితం. అలాగే ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటి ప్రత్యేకతలున్నాయి. 

ఇక రూ.1,999 ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. 365 రోజులు ప్రతి రోజు ఈ మేర డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ప్లాన్ ప్రస్తుతం కేరళ సర్కిల్‌లో అందుబాటులో ఉంది. 

error: Content is protected !!