BSF Jobs: బీఎస్ఎఫ్‌లో 1072 ఉద్యోగాలు… మొదలైన దరఖాస్తు ప్రక్రియ

మీరు ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌-BSF. గత నెలలో ప్రకటన విడుదల చేసిన బీఎస్ఎఫ్… దరఖాస్తు ప్రక్రియను మే 14న ప్రారంభించింది. గ్రూప్‌ సీలో మొత్తం 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది బీఎస్ఎఫ్. వీటిలో హెడ్‌ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులు 300 కాగా, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టులు 772. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 12 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

BSF Recruitment 2019: ముఖ్యమైన వివరాలు ఇవే…

మొత్తం పోస్టులు: 1072హెడ్‌ కానిస్టేబుల్-రేడియో ఆపరేటర్- 300

హెడ్ కానిస్టేబుల్-రేడియో మెకానిక్- 772దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మే 14

దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 12

విద్యార్హతలు: ఇంటర్ లేదా ఐటీఐ.

వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు)

రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాల కోసం http://bsf.nic.in/en/recruitment.html వెబ్‌సైట్ చూడొచ్చు.

error: Content is protected !!