Movies

దీన స్థితిలో ఉన్న సుధాకర్… సహాయం కోసం చిరంజీవి ఇంటికి వెళ్ళితే… ఒక్కప్పటి మిత్రుడని చూడకుండా… ?

తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన హీరోగా మెగాస్టార్ చిరంజీవి నిలుస్తాడు. అల్లు రామలింగయ్య,అల్లు అరవింద్ సపోర్ట్ కూడా ఉండడంతో అనూహ్యంగా ఇండస్ట్రీని ఏలే స్థాయికి చేరాడు. ఇక తనకు సాయం చేసిన వాళ్లకు తిరిగి సాయం చేసే గొప్ప గుణం కూడా చిరంజీవికి ఉంది. ఇండస్ట్రీలో ఇలా తనకు సాయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకుని మళ్ళీ సాయం చేయడం చాలా అరుదు. తనతో నటనలో శిక్షణ పొందినవాళ్లను, చదువుకున్న వాళ్ళను చిరంజీవి గుర్తుపెట్టుకుని ఉంటాడు. అందుకే చిరంజీవికి ఓ ప్రత్యేకత ఉందని అంటారు. 

ఇక తనదైన డైలాగ్ డెలివరీ తో కమెడియన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ఒకప్పుడు చిరంజీవికి రూమ్ మేట్. నటనలో శిక్షణ ఒకేచోట పొందారు. చిరు కన్నా ముందే అందునా తమిళనాట హీరోగా సుధాకర్ ఓ వెలుగు వెలిగాడు. తరువాత పరిస్థితుల నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి, విలన్ గా, కమెడియన్ గా,క్యారెక్టర్  ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు. ఆరోగ్య సమస్యలు రావడంతో సుధాకర్ కి సినిమా ఛాన్స్ లు తగ్గిపోయి , సినీ కెరీర్ దాదాపు ఆగిపోయింది. లాబీయింగ్ చేయకుండా ప్రతిభను నమ్ముకోవడం వలన వెనుకబడిపోయాడు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుధాకర్ ఫ్యామిలీ  మెంబర్స్ సలహా మేరకు మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్ళాడు. 
తన ప్రాణ స్నేహితుడు రావడంతో చిరంజీవి ఆప్యాయంగా కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేసాడు.

చిరు భార్య కూడా అక్కడ మాటల్లో పాలు పంచుకున్నారు. కొంతసేపు మాట్లాడాకా, సినిమాల్లో ఛాన్స్ లు ఇప్పించమని అడగలేక ఇక వెళ్లివస్తానని సుధాకర్ లేవడంతో చిరంజీవి అతడి ఇబ్బందిని గమనించాడు. సురేఖకు చెప్పి ,ఓ ఐదు లక్షల చెక్కు ఇవ్వడంతో సుధాకర్ షాక్ తిన్నాడు. తాను ఏమీ అడగకుండానే సాయం చేయడంతో అలాగే సుధాకర్ చూస్తూ ఉండిపోయాడు. ‘నా ఫ్రెండ్ ఏ స్థితిలో ఎలా ఉన్నాడో నాకు తెలీదా? మనం చాలా ఏళ్ళక్రితం కలుసుకుని ఉండొచ్చు. కానీ నీ గురించి అప్పుడప్పుడు ఆరా తీస్తూనే ఉన్నాను. అందుకే ఏమైనా అవసరానికి పనికొస్తుంది ఈ 5లక్షలు ఉంచుకో’ అని చిరంజీవి చెప్పడంతో సుధాకర్ భావోద్వేగంతో కదిలాడు.