‘కార్తీకదీపం’ సౌర్యని కూతురుగా ఒప్పుకున్న దీప.. కార్తీక్ ట్విస్ట్

బుల్లితెర ప్రేక్షకుల్ని టీవీలకు కట్టిపడేస్తున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 494 ఎపిసోడ్‌లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసి మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ‘సౌర్య తన కూతురేనని దీప బయటపడటంతో కార్తీక్‌ ఆవేశంతో ఊగిపోయాడు. ‘‘ఇప్పటివరకూ ఎందుకు చెప్పకుండా దాచవ్‌’’ అని రగిలిపోయాడు. ‘‘చెబితే పసిదాన్ని కూడా నన్ను అన్నట్లే మాటలంటావని.. భయమేసింది’’ అని బదులిస్తుంది దీప. ‘‘నువ్వు చేసిన తప్పులకి పసిదాన్ని బాధపట్టేంత మూర్ఖుడిని కాను నేను. దానికి ఏం చెప్పలేదు’’ అంటాడు కార్తీక్‌. అదే సమయానికి ఆటోలో వచ్చిన సౌర్య… అమ్మా అనబోయి.. వంటలక్కా అంటూ పరుగున వచ్చి దీపని కౌగిలించుకుంటుంది. అప్పటికే ఏడుస్తున్న దీప.. కూతుర్ని పట్టుకుని బాగా ఏడుస్తుంది. అది చూసి, అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతున్న కార్తీక్‌ని.. ‘‘డాక్టర్‌ బాబూ..’’ అని పిలుస్తుంది సౌర్య. సౌర్య పిలుపుకి ఆగిన కార్తీక్‌ని.. పరుగున వెళ్లి హగ్‌ చేసుకుంటుంది. కానీ బలవంతంగా ఆ చేతులను వదిలించుకుని కార్తీక్‌ వెళ్లిపోతాడు. 

సౌర్యని కార్తీక్‌ బయటికి తీసుకుని వెళ్లాడని హిమ చెప్పడంతో.. సౌందర్య–ఆనందరావు–ఆదిత్య షాక్‌ అవుతారు. ‘ఎక్కడి తీసుకుని వెళ్లాడు’ అని అడిగితే… ‘వంటలక్క ఇంటికి’ అంటుంది హిమ. దాంతో ‘కార్తీక్‌ ఏం చేస్తున్నాడో..? దీప పరిస్థితి ఏంటోనని భయపడుతూ, బాధపడుతూ ఉంటారు వాళ్లు. ఇంతలో కార్తీక్‌ రావడంతో ముగ్గురూ ఆందోళనగా పైకి లేస్తారు. ‘‘ఎందుకు లేచారు కూర్చోండి..’’ అంటూ వెటకారం చేస్తాడు కార్తీక్‌. 

‘‘సౌర్య ఏదిరా?’’ అంటుంది సౌందర్య. ‘‘చిల్లర కొట్టు చిట్టెమ్మకి, దుబాయ్‌ నాన్నకీ’’ ఇచ్చేశాను అంటాడు కార్తీక్‌. ‘‘నిజం చెప్పు’’ అని ఆవేశంగా కాలర్‌ పట్టుకుంటుంది సౌందర్య. ‘‘నిజం తెలిసింది..!!’’ అని గట్టిగా అరుస్తాడు కార్తీక్‌. కార్తీక్‌ సమాధానం విని.. వెంటనే కాలర్‌ వదిలేస్తుంది సౌందర్య. ‘‘మీరు ఆడిన నాటకం బయటపడింది. హిమని దానికి.. సౌర్యని నాకూ దగ్గర చెయ్యాలనుకున్న మీ పథకం నాకు తెలిసిపోయింది’’ అంటూ ఆవేశంగా ఊగిపోతాడు కార్తీక్‌. కార్తీక్‌ మాటలకి ఆ ముగ్గురూ చాలా షాక్‌లో ఉండిపోతారు.‘‘ఏం నటించారు మమ్మీ అంతా? అందరికీ మించిపోయి ఆ సౌర్య ఏం నటించింది? ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక దాని తల్లిని మించిపోతుంది’’ అంటూ మాట్లాడతాడు కార్తీక్‌..

దీప సౌర్యని.. ‘అత్తమ్మా..’ అంటూ దగ్గరికి తీసుకుంటుంటే.. సౌర్య కోపంతో దూరం జరుగుతుంది. ‘‘ఎందుకు నా చేత వాళ్లందరికీ అబద్ధం చెప్పించావ్‌? ఎందుకు డాక్టర్‌ బాబు నన్ను అక్కడ ఉంచుతుంటే.. నా కుతురేనని చెప్పలేదు? ఎందుకు కార్తీక్‌ బాబు తప్ప మిగిలిన వాళ్లంతా నన్నూ హిమతో సమానంగా చూస్తున్నారు? నువ్వు నాకు చాలా అబద్ధాలు చెప్పావా?’’ అంటూ దీపని గట్టిగా నిలదీస్తుంది సౌర్య. 

దాంతో దీప చాలా ఏడుస్తుంది. ‘‘ఇదంతా నా కర్మ. నా కన్న కూతురి ముందు ఇలా నిలబడాల్సి వచ్చిందే.. నీకోసమేగా నేను ఇన్ని బాధలు పడుతున్నాను. నా కూతురువని తెలిస్తే నీకు గౌరవం ఉండదనే అలా చేశాను’’ అంటూ కూలబడి ఏడుస్తుంది. అది చూసి సౌర్య కూడా ఏడుస్తుంది. ‘‘అమ్మా ఏడవకు అమ్మా. నన్ను అన్ని రోజులు అలా వదిలేశావని కోపంతో అలా అనేశాను. ఇంకెప్పుడు అలా అనను. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పమన్నా చెబుతాను’’ అంటూ తల్లి దీపని పట్టుకుని ఏడ్చే ఆ సన్నివేశం.. ప్రేక్షకుడి గుండెను తడిపేలా ఉంటుంది. 

నేటి ఎపిసోడ్‌లో… 
శ్రావ్య శ్రీమంతానికి.. కార్తీక్‌తో సహా సౌందర్య ఫ్యామిలీ అంతా వస్తారు. దీప సౌర్యని తీసుకుని వస్తుంది. దీపని చూసి సౌందర్య షాక్‌ అవుతుంది. ఎక్కడ కవలపిల్లల గురించి అడుగుతుందోనని భయపడుతుంది. దీప సౌందర్యని చూసి సంతోషిస్తుంది. ఇప్పుడైనా కవలల గురించి అడగొచ్చనుకుంటుంది. దీప–సౌందర్యలు కలుస్తారా? సౌందర్య నిజం చెబుతుందా? ఇప్పుడైనా హిమ తన కూతురేనని దీపకి తెలుస్తుందా? వంటి ఆసక్తికరమైన అంశాలతో కథ ముందుకు సాగుతోంది.

Keywords:కార్తీక దీపం|కార్తీక దీపం సీరియల్|karthika deepam today episode|karthika deepam serial full episodes|karthika deepam serial today|karthika deepam latest|karthika deepam 494 episode|karthika deepam 14 may 2019 episode|karthika deepam serial|karthika deepam

error: Content is protected !!