మహేష్ బాబు సంచలన నిర్ణయం…ఇప్పటివరకు ఏ హీరో చేయలేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా వచ్చిన మహర్షి మూవీ టాలీవుడ్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇలాంటి సినిమా చేయడం గర్వంగా ఉందని కాలర్ ఎగరేసి మరీ ఇటీవల సక్సెస్ మీట్ లో చెప్పడం విశేషం. మూడు షేడ్స్ లో ఈ మూవీలో మహేష్ తన నటనను కనబరిచాడు. దిల్ రాజు, అశ్వినీదత్,పొట్లూరి వి ప్రసాద్ నిర్మించిన ఈమూవీ భారీ అంచనాల నడుమ రిలీజయింది. స్టూడెంట్,సిఇవో,రైతు ఈ మూడు పాత్రలలో ఒదిగిపోయిన మహేష్ యువతకు, రైతులకు బాగా కనెక్ట్ అయ్యాడని పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే మహర్షి మూవీని అలా వదిలేయకుండా ఏదో చేయాలన్న సెన్షేషన్ నిర్ణయాన్ని మహేష్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఓ సినిమా రిలీజ్ అయ్యాక హాలిడే ట్రిప్ ఫ్యామిలీతో ప్లాన్ చేయడం మహేష్ కి అలవాటు. అదేవిధంగా మహర్షి రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో కల్సి విదేశాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, సినిమా మరింత ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఫామిలీ టూర్ క్యాన్సిల్  చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ మహేష్ బాబు మూవీస్ లో వందకోట్ల షేర్ వసూలు చేసిన మూవీ లేదు. మహర్షి ఆ రికార్డ్ అధిగమిస్తోంది.

వ్యవసాయం అందరిలో భాగం కావాలని , రైతు అంటే సానుభూతి కాకుండా గర్వంగా జీవించే పరిస్థితులు రావాలని సందేశంతో ఈ మూవీ రూపొందించారు. అయితే మహేష్ లక్ష్యం వందకోట్ల షేర్ రీచ్ అవ్వడం కాదు. నాన్ బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ద్వారా సరికొత్త బెంచి మార్క్ క్రియేట్ చేయాలని మహేష్ భావిస్తున్నాడు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దగ్గరకు వెళ్లడంతో పాటు రైతులు ,విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!