రైస్ కట్లెట్

కావాల్సిన పదార్ధాలు
అన్నం 1 కప్పు,టమాటా రసం అరకప్పు,వెన్న -1 స్పూన్,అల్లం చిన్న ముక్క,చీజ్ 50 గ్రాములు,బ్రెడ్ పొడి -1, ఉప్పు,మిరియాలపొడి అర స్పూన్,నూనె వేయించడానికి సరిపడా,ఉప్పు తగినంత

తయారు చేయు విధానం
బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, బెల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి.సగం నీళ్లు ఇంకి పోయాక టమోటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి.తర్వాత అందులోనే చీజ్ వేసి పొయ్యి కట్టేయ్యాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా(కట్లెట్ ఆకారంలో) చేసి నూనెలో వేయించుకోవాలి.వీటిని అల్లం చట్నీ లేదాటమాటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

error: Content is protected !!