నైజం రికార్డ్స్ నెంబర్ 1 హీరో ఎవరు?

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈమూవీ మహేష్ 25వ చిత్రం కాగా, మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. నిజానికి ఇంతటి ఘన విజయాన్ని నమోదుచేస్తుందని ఎవరూ ఊహించలేదు. మామూలుగానే యుఎస్ లో మహేష్ మూవీకి భారీగానే డిమాండ్ ఉంటుంది. పెద్దఎత్తున ప్రీమియర్ షో ప్లాన్ చేయడం,దానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురుస్తోంది. సీడెడ్ లో కూడా కాసుల పంట పండిస్తోంది.
ఇక ఇప్పటీకే నైజాం లో 22.05 కోట్ల షేర్ వసూలు చేసిన మహర్షి మూవీ ఇంకా వసూళ్ళలో దూసుకెళ్తోంది.

మరో 27లక్షలు వసూలు చేస్తే,శ్రీమంతుడు లాంగ్ రన్ షేర్ ని కూడా బీట్ చేసేస్తుంది. ఇక తర్వాత టార్గెట్ రామ్ చరణ్ కావచ్చని అంటున్నారు. ఎందుకంటే, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో గత ఏడాది వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తొలివారం పూర్తయ్యేసరికి 130కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా నైజాం లో ఫుల్ రన్ లో 27. 76 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 1980నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ మూవీలో హీరో చెవిటివాడిగా చేయడం,సినిమాలో భావోద్వేగాలు బాగా పండించారు. రామ్ చరణ్ నటనకు జనం బ్రహ్మరధం పట్టారు. 

నైజాం లో రంగస్థలం  రికార్డ్ ని మహర్షి తప్పకుండా ఓవర్ టేక్ చేస్తుందని అంటున్నారు. కొన్ని రోజుల్లో ఈ విషయం తెలుస్తుంది. విజయవాడ ,గుంటూరులలో నాన్ బాహుబలి రికార్డ్స్ ని అధిగమించిన మహర్షి మూవీ ఇంతగా భారీ విజయాన్ని అందుకోవడం పట్ల మహేష్ గతంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాడు. తెలంగాణ లో ఇప్పటికే చిత్ర యూనిట్ పలు ప్రెస్ మీట్స్ పెట్టింది. కాలర్ ఎగరేసి మరీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ మరింత దూకుడు ప్రదర్శించడానికి ఫామిలీ ట్రిప్ కూడా రద్దు చేసుకుని,ప్రమోషన్ వర్క్ పై దృష్టి పెట్టాడు. ఇక విజయవాడ సిద్ధార్ధ కళాశాల ఆవరణలో భారీ ఎత్తున విజయోత్సవ సభను జరిపారు. 

error: Content is protected !!