Movies

మహేష్ మూవీలో విజయశాంతికి అదిరిపోయే రెమ్యునరేషన్ …. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ స్టార్ హీరోయిన్ గా రాణించి లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో యాంగ్రీ హీరోయిన్ గా చేసిన పాత్రలకు తీసుకున్న రెమ్యునరేషన్ హీరోలకు ధీటుగా ఉండేదని అంటారు. సౌత్ ఇండియాలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ గల విజయశాంతి అప్పట్లో గ్యాంగ్ లీడర్,ఒసేయ్ రాములమ్మ,కర్తవ్యం, వంటి చిత్రాలతో టాప్ రేంజ్ కి చేరింది. చివరిసారిగా నాయుడమ్మ మూవీలో కనిపించింది. 

అయితే సినిమాల్లో మంచి కెరీర్ లో ఉండగానే క్రేజీ హీరోయిన్ నుంచి పొలిటికల్ వైపు దృష్టి పెట్టింది.రాజకీయాల్లో చేరి ఎంపీగా ఎన్నికై, ఇన్నాళ్లూ రాజకీయాల్లోనే కొనసాగుతూ సినీ రంగం వైపు కన్నెత్తి చూడలేదు. సినిమాల్లో ఎన్నో ఆఫర్స్ వచ్చినా ఆమె పట్టించుకోలేదు. అయితే అలనాటి హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ తో దున్నేస్తుంటే,ఇక విజయశాంతిని కూడా ఓ కీలక పాత్రకోసం సంప్రదింపులు జరిపారట. ఆమె అందుకు ఒకే చెప్పినా, రెమ్యునరేషన్ డిమాండ్ ఇప్పుడు చర్చకు దారితీసింది.

మహేష్ బాబు హీరోగా ఎఫ్ 2డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమాలో ఓ కీలక పాత్రకోసం విజయశాంతి అయితే బాగుంటుందని అనుకున్నారట. వెంటనే ఆమెను కల్సి చర్చించడంతో ఒకే చెప్పేసింది. ఇక స్టార్ హీరోలకే అసూయ కలిగించేలా విజయశాంతి రెమ్యునరేషన్ అడిగినట్లు చర్చ నడుస్తోంది. దాదాపు 5కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అయితే ఆ పాత్రకు విజయశాంతి మాత్రమే సూటవుతుందని భావించడం వలన అంతమొత్తాన్ని ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్స్ సిద్ధపడ్డారట. ఎంతోకొంత తగ్గించమని మాత్రం అడుగుతున్నారట.