NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు) రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కోసం పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 26 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు : 87అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఎ) : 79 పోస్టులు

అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయసు : 01.05.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
మేనేజర్ (గ్రేడ్ బి) : 8 పోస్టులువిభాగం: జనరల్
అర్హత : 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు
వయసు : 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
ఫీజు : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు : రూ.650 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సడలింపులుంటాయి)మేనేజర్ పోస్టులకు : రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సడలింపులుంటాయి)
ఎంపిక : ప్రిలిమినరీ(ఆబ్జెక్టివ్), మెయిన్ రాతపరీక్షలు (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ ద్వారా..
అప్లై చేసేందుకు చివరితేది : 26-05-2019

error: Content is protected !!