Movies

మహేష్ తో టెన్షన్ పడుతున్న అనిల్ రావిపూడి

నవ్వుతూ నవ్విస్తూ ఉండేలా ఎఫ్ 2సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దశ తిరిగింది. పెద్ద హీరోలు సినిమాలు చేయమని అడుగుతున్నారు. అయితే ఒక్కసారిగా అతడికి ఎందుకో భయం పట్టుకుందట. ముఖ్యంగా మహర్షి మూవీకి వస్తున్నా కలెక్షన్స్,రికార్డ్స్ చూసి వణుకు పుడుతోందట. అయినా ఆసినిమాకు అతడికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు చిక్కంతా. అవును సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా రిలీజ్ అయిన మహర్షి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే మహేష్ తరువాత సినిమా చేయబోయేది అనిల్ రావిపూడి కదా. 

అసలు విషయానికి వస్తే, మహర్షి రిలీజ్ కి ముందే మహేష్,అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ ఖరారయింది. జూన్ లో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే సమయానికి మహర్షి సినిమా వంద కోట్ల దిశగా వెళ్తుంది. మహేష్ కెరీర్ లో ఇదే రికార్డ్ కావడంతో అనిల్ ని టెన్షన్ కి గురిచేస్తోంది. ఒక సినిమా హిట్ అయ్యాక ఆతర్వాత వచ్చే మూవీపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలాంటి అంచనాని అందుకోవాలంటే డైరెక్టర్ కి చాలా కష్టమే. అందుకే అనిల్ సినిమాలో మహేష్ ని ఎలా చూపించబోతున్నాడు,ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడు వంటి ప్రశ్నలు,సవాళ్లు ఎదురవుతాయి. అభిమానుల్లో చర్చ కూడా మొదలైంది. 

ఇక అనిల్ కూడా ఈ విషయాన్ని మహర్షి సక్సెస్ మీట్ లో ప్రస్తావిస్తూ, అభిమానులు మహర్షి తర్వాత వచ్చే సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుంటారని వాటిని ఫుల్ ఫిల్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అందుకే కొంచెం భయంగా కూడా ఉందని చెప్పుకొచ్చాడు. 25వ మూవీ సక్సెస్ లో మహేష్ ఉన్నాడని, ,అందుకే తాను తీయబోయే సినిమా ఎంత పెద్ద హిట్ కొడుతుందని కాకుండా మహేష్ తో మంచి సినిమా తీస్తే ఆయనలో కనిపించే చిరునవ్వే తన టార్గెట్ అని చెప్పాడు. వెంకటేష్ వంటి సీనియర్ నటుడితో కామెడీ పండించినపుడు ఎఫ్ 2 సినిమా 80కోట్లు వసూలు చేసింది. మరి మహేష్ వంటి సూపర్ స్టార్ తో నవ్వులు పూయిస్తే ,అంతకు రెట్టింపు వస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.