పసుపు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

పసుపు అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని అంటూ ఉంటారు. పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్‌ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్‌ అనే పదార్థం కారణంగానే  పసుపు సహజమైన పసుపురంగులో ఉంటుంది వంటల్లో వాడే మసాలా దినుసులతో పసుపు చాలా ముఖ్యమైనది. మన భారతదేశంలో సుమారు 6 వేల సంవత్సరాల నుండి పసుపును  ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పసుపును తప్పనిసరిగా వాడతారు. భారతదేశంలో పసుపు వాడని  అతిశయోక్తి కాదేమో. . పసుపులో ఆరోగ్య ప్రయోజనాలు మరియు సౌదర్య ప్రయోజనాలు ఎన్నో దాగి ఉన్నాయి. 

ముందు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఒక ఔన్స్ పసుపులో మానవ శరీరానికి కావాల్సిన ఐరన్, బి6, మెగ్నీషియం, విటమిన్ సి, పోటాషియం, ఫైబర్ అందుతాయి.  ఆహారంలో ఉన్న చెడు కొలేస్ట్రాల్ తో పాటు ఇతర హానికర పదార్దాలను తొలగిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది. పసుపు కొమ్ము పొగ పీల్చినా లేదా పసుపు నీళ్లు ఆవిరి పట్టినా వికారం, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. పసుపు జ్ఞాపకశక్తిని పెంచటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. మన పూర్వికులు పసుపును ఎక్కువగా ఉపయోగించటం వలన అల్జీమర్స్ వంటి వ్యాధులు చాలా తక్కువగా ఉండేవి.

వేడి పాలల్లో చిటికెడు పసుపు కలిపి త్రాగితే రొంప,దగ్గు వంటి గొంతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన కీళ్ళనొప్పులు నయం చేయడానికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను తొలగిస్తుంది. పసుపు పొట్టలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి జీర్ణక్రియ బాగ జరిగేలా చేస్తుంది. ప్రతి రోజు వంటల్లో పసుపు వాడటం వలన పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కోలన్, ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ లు రాకుండా కాపాడుతుంది.  పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో మధుమేహం  కంట్రోల్లో ఉంటుంది.

error: Content is protected !!