దిల్ రాజు ఎంట్రీతో సాహో పై అంచనాలు పెరిగిపోయాయి

బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులంతా రెండేళ్ళు గా ఎంతో ఆతృతగా ‘సాహో” చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల కూడా ఈ సినిమాపై అంచనాతో ఉన్నారు. ఇక ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదల కాబోతుందని తెలిసిన వెంటనే అందరిలోనో మరింత ఆసక్తి మరింత పెరిగింది. 

ఇక తాజాగా ఈ చిత్రం పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరింత అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు. అవును ,దిల్ రాజుకి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? ‘సాహో’ చిత్రం నైజాం, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులకి గానూ 45 కోట్ల వరకూ ఆఫర్ చేసాడట. దిల్ రాజు ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేయడంతో ‘సాహో’ చిత్రం పై అంచనాలు మరింత బలపడుతున్నాయి. 

చిత్రం పై దిల్ రాజు కి ఎంతో నమ్మకం ఉంటే గాని ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేయడ ని అందుకే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని  కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గతంలో ప్రభాస్ నటించిన చాలా సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఇక ప్రభాస్ తో కూడా దిల్ రాజుకి మంచి అనుబంధం ఉంది. గతంలో ప్రభాస్ తో ‘మున్నా’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి చిత్రాలని కూడా దిల్ రాజు నిర్మించాడు. సో .. దిల్ రాజు ఎంట్రీతో సాహో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

error: Content is protected !!