బిగ్ బాస్ కోసం బండ్ల గణేష్ కండీషన్ చూస్తే షాకవుతారు

 తెలుగు రెండు దశల్లో పూర్తయిన బిగ్ బాస్ ఇక సీజన్ 3 కోసం చర్చలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున ఓకే అయినా,ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి. రేణు దేశాయ్.. కేఏపాల్.. బిత్తిరి సత్తి.. సావిత్రి.. శ్రీముఖి.. ఉదయ భాను.. వరుణ్ సందేశ్ ఇలా ఎంతో మంది పేర్లు మీడియాలో వచ్చాయి. 

కొత్తగా పేర్లు యాడ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణానికి దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడట. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ వారు ఆయన షోలో పాల్గొంటాడని భావించారు. అయితే బండ్ల గణేష్ మాత్రం వింత కండీషన్స్ పెట్టి బిగ్ బాస్ కు నో చెప్పిన్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ లో ఉన్నా కూడా తనకు వారంలో రెండు మూడు సార్లు అయినా ఫోన్ ను ఇవ్వాలని, తన కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండేలా తనకు ప్రత్యేక అనుమతించాలని కోరాడట. అందుకు షో నిర్వాహకులు ససేమిరా అనేసారట. బిగ్ బాస్ షో అంటేనే షో లో ఉన్నన్ని రోజులు కుటుంబ సభ్యులకు ,బయటి ప్రపంచంకు దూరంగా ఉండటం గా భావించాలని చెప్పేశారట. అన్నీ తెల్సి ఫోన్ కావాలని అడిగితే ఎలా ఇస్తారని బండ్ల బాబు ఎలా అనుకున్నాడో ఆయనకే తెలియాలి.

error: Content is protected !!